ఫిష్ ఆంధ్రా డైలీ ( ఫిష్ కియోస్క్) షాపు ప్రారంభం

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ఫిష్ ఆంధ్రా డైలీ ( ఫిష్ కియోస్క్) షాపు ప్రారంభం


*


రాష్ట్రంలో తలసరి చేపల వినియోగం పెంచటానికి రాష్ట్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డోమస్టిక్ మార్కెట్ లో భాగంగా ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ఫిష్

కియోస్కీ (బ్రతికి ఉన్న చేపల అమ్మక కేంద్రాలు ఏర్పాటుకు రాయితీతో కూడిన ఆర్ధిక సహాయం

అందించి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, డయిరీ డెవలప్మెంట్ మరియు మత్య్సశాఖ

స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పూనం మాలకొండయ్య తెలిపారు.

సోమవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాయలయంకు వెళ్ళే దారిలో క్రిస్టియన్ పేట వద్ద ఫిష్ ఆంధ్రా డైలీ ( ఫిష్ కియోస్క్) షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక,డయిరీ డెవలప్మెంట్ మరియు మత్య్సశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పూనం మాలకొండయ్య,

శాసనమండలి సభ్యులు హనుమంతరావు, రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ కె. కన్నబాబు, జిల్లా

కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక, డయిరీ

డెవలప్మెంట్ మరియు మత్య్సశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ

రాష్ట్రంలో లభిస్తున్న మత్స్య సంపద ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్నారని, అక్కడ

గిట్టుబాటు ధరలు లేక మత్స్య కారులు నష్టపోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో అనివార్య

కారణాలతో రవాణా వ్యవస్థ స్థంభించటం వలన కూడా 'మత్స్య సంపద ఇక్కడే నిలిచి మత్స్యకారులుఇబ్బందులు పడుతున్నారన్నారు. మన రాష్ట్రంలో మత్స్య సంపదను ఇక్కడే ప్రజలకు

వినియోగించేందుకు ఫిష్ ఆంధ్రా బ్రాండ్ తో డొమస్టిక్ మార్కెటింగ్ ప్రోత్సహించటానికి పీఎంఎంఎస్ వై

పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం, బీసీ, ఓసీ లకు 40 శాతం రాయితీ తో ఆర్ధిక

సహాయం అందింస్తు రిటైల్ షాపులు ఏర్పాటునుప్రోత్సహిస్తున్నామన్నారు.రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ కె కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తికి

అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే సీ ఫుడ్స్ ను

ప్రజలకు అందుబాటులో ఉంచటానికి, మత్స్స సంపద ఉత్పత్తిని ప్రోత్సహించటానికి ఫిష్ ఆంధ్రాలోని వివిధ పధకాల ద్వారా రాయితీ తో కూడిన ఆర్ధిక సహాయంను అందిస్తున్నామన్నారు.

జిల్లాలోనే తాడేపల్లిలో రూ. 10 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తొలి ఫిష్ కియోస్కీ ప్రారంభించటం

జరిగిందని, దీనికి 60 శాతం రాయితీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో బ్రతికి ఉన్న చేపలతో

పాటు రోయ్యలు, పీతలు, సముద్ర చేపలు, వాల్యూ యాడెడ్ ఉత్పత్తులు, ఇతర శీతలీకరించిన

నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 26 ఫిష్ కియోస్కీ ల

ఏర్పాటుకు లక్ష్యాలు నిర్దేశించారని, ఇప్పటికే 10 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆసక్తి ఉన్న

యువ వ్యాపారవేత్తలు జిల్లా మత్స్య శాఖ అధికారులను సంప్రదించి యూనిట్ల ఏర్పాటుకు

దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం

అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు నాణ్యమైన సీ ఫుడ్స్ ను ఫిష్ ఆంధ్రా

రిటైల్ నిర్వహకులు సరసమైన ధరలకు అందించాలన్నారు.

తొలుత ఫిష్ ఆంధ్రా డైలీ ( ఫిష్ కియోస్క్) షాపు ప్రారంభోత్సవ సందర్భంగా శాసనమండలి

సభ్యులు మురుగుడు హనుమంతరావు రిబ్సన్ కత్తిరించగా, రాష్ట్ర పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ మరియు మత్య్సశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పూనం మాలకొండయ్య, రాష్ట్ర

మత్య్సశాఖ శాఖ కమిషనర్ కె. కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జ్యోతి వెలిగించిచారు.

అనంతరం షాపు లో లైవ్ ఫిష్ పాండ్, శీతలీకరణ లో ఉన్న ఫిష్ ఉత్పత్తుల, వాల్యూయాడెడ్

ఉత్పత్తులు, ఫిష్ ప్రోసెసింగ్ ను పరిశీలించారు.కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రంగనాధ బాబు, తాడేపల్లి తహశీల్దారు

శ్రీనవాసరెడ్డి, మత్స్య అభివృద్ధి అధికారి సీహెచ్ ప్రసాద్, ఆంధ్రా డైలీ నిర్వహకులు మిరియాల

ప్రశాంతి, మత్య్సశాఖ సిబ్బంది పాల్గోన్నారు.

Comments