ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదు*వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*వ్యవసాయ శాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు.*


సాధారణ వర్షపాతం (జూన్‌ నుంచి నవంబరు వరకు) 775 మి.మీ. కాగా, 781.7 మి.మీ. వర్షపాతం నమోదు.

ఖరీప్‌ సీజన్‌లో సాధారణ సాగు నమోదు.

186 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఉంటాయని అంచనా.

ఇ– క్రాపింగ్‌ నమోదుపై వివరాలు అందించిన అధికారులు.

వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్‌ ఆథరైజేషన్‌ నూటికి నూరుపాళ్లు పూర్తయ్యిందన్న అధికారులు.

రైతులనుంచి కూడా 93శాతం ఇ–కేవైసీ పూర్తయ్యిందని వివరించిన అధికారులు.

మిగిలిన 7 శాతం రైతులకు ఎస్సెమ్మెస్‌లు ద్వారా ఇ–క్రాప్‌ వివరాలు పంపించాలన్న సీఎం. 

గ్రామంలో రైతుల సమక్షంలో సోషల్‌ఆడిట్‌ కూడా  నిర్వహించామన్న అధికారులు.

ధాన్యం సేకరణపై కూడా ప్రణాళికను వివరించిన అధికారులు.


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:* 


ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదు:

దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలి:

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం:

రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి:

ఇ–క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ కొనసాగాలన్న సీఎం

వ్యవసాయశాఖతో పౌరసరఫరాల  శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.


రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించిన సీఎం

ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధంచేసుకోవాలన్న సీఎం

22.92 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని అంచనా.

సున్నావడ్డీ పంటరుణాలతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా నవంబరు 29న జమ చేయాలని నిర్ణయం.


పొలంబడి కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు అప్రెంటిషిప్‌ చేయించడం, వారి ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన పెంపు, వారి నుంచి సలహాలు పొందడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.


ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం

వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్‌ ఉండేలా చూడాలన్న సీఎం

కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్రసామగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్న సీఎం

రైతులందరికీ వీటి సేవలు అందాలన్న సీఎం.


*ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై సీఎం సమీక్ష.* 

భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని సీఎం ఆదేశం. 

ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం.

మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందన్న సీఎం.

దీనివల్ల పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్న సీఎం.

భూసారాన్నికూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్న సీఎం.


వ్యవసాయ రంగంలో ఉత్తమ విధానాలు, వివిధ రకాల కార్యక్రమాలు, ఉత్పత్తి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, అదనపు విలువ, మౌలిక సదుపాయాలు, ఎగుమతులకు సంబంధించి విశేష ప్రతిభ కనపర్చిన వారికి 2022 సంవత్సారానికి గానూ...ఇండియా అగ్రిబిజినెస్‌ అవార్డులు అందిస్తున్న ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎఫ్‌ఏ). 

విత్తన కేటగిరీలో అవార్డు గెల్చుకున్న ఏపీ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌. 


ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జి శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image