ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ చర్యలు



*ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ చర్యలు*


పార్వతీపురం, నవంబరు 23 (ప్రజా అమరావతి): జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరిగిందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్ తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత శాఖల సమన్వయంతో ముందుగానే పటిష్టమైన చర్యలు తీసుకొని రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన అన్నారు. "ధాన్యం దళారుల పాలు" శీర్షికన ఒక దినపత్రికలో బుధ వారం ప్రచురితమైన వార్తపై జిల్లా మేనేజర్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. జిల్లాలో పాలకొండ, వీరఘట్టం, భామిని తదితర మండలాలలో బస్తాలలో నింపి కొనుగోలుకు ఎదురు చూస్తున్నారని మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులలో అందోళన చెంది దళారులకు ప్రభుత్వం తెలిపిన మద్దతు ధర కన్న తక్కువకు అమ్ముకుంటున్నారని వార్తలో ప్రచురించడం జరిగిందని ఆయన పేర్కొంటూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ  ఫభుత్వం తరుపున ధాన్యం కొనుగోలు చేయు నిమిత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసిందని చెప్పారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోళ్ళు చేయు ప్రక్రియలో భాగంగా మండలాల వారిగా వరి కోతలు పూర్తి అయిన ప్రకారం వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కావలసిన మౌలిక సదుపాయాలు, ధాన్యం నాణ్యతను పరిశీలించే పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆయన వివరించారు. నవంబరు 3వ వారం నుంచి  సంబంధిత సిబ్బందిని అన్ని ఆర్.బి.కెల వద్ద గల పి.పి.సి లలో ఉందాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేయ్యటం జరిగిందని ఆయన అన్నారు. జిల్లా స్ధాయిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (08963 293037, 7702003585) కు రైతులు వద్ద నుండి ఏటువంటి ఫిర్యాదులు ఇంత వరకు అందలేదని ఆయన చెప్పారు.వార్తలో ప్రచురించిన పాలకొండ మండల రైతు వెంకట నాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో దళారులకు విక్రయించానని చెప్పడంలో వాస్తవం లేదని నాయక్ అన్నారు. వెంకట నాయుడు పాలకొండ మండలంలో తన పరిధిలో గల తుమరాడ రైతు భరోసా కేంద్రంలో సంప్రదించలేదని,  ఏ దళారులకు విక్రయించ లేదని ఆయన స్పష్టం చేశారు. దాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని, ధాన్యం దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు ఎవరూ పౌర సరఫరాల సంస్థకు గాని, కంట్రోల్ రూమ్ కు గాని ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

Comments