బీసీ నేత అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్ట్ ను ఖండించిన శిష్ట్లా లోహిత్



 *- బీసీ నేత అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్ట్ ను ఖండించిన శిష్ట్లా లోహిత్* 

 *- రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది* 

 *- అయ్యన్న కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు* 

 *- పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా* 



విజయవాడ, నవంబర్ 3 (ప్రజా అమరావతి): బీసీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్ పై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ఖండించారు. అక్రమ అరెస్ట్ లను నిరశిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన పలు కార్యక్రమాల్లో శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భూకబ్జాలు, అరాచకాలకు పాల్పడుతోందన్నారు. వీటన్నింటినీ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నారనే కక్షతో అయ్యన్నపాత్రుడును, రాజేశ్ ను బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు, రాజశ్ ను అరెస్ట్ చేసి ప్రభుత్వం కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలోని బీసీ నేతలను భయపెట్టే ఉద్దేశ్యంతోనే అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లకు పాల్పడ్డారన్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు నాయకత్వంలో సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు. రిషికొండ అక్రమ తవ్వకాలపై అయ్యన్నపాత్రుడు చేసిన పోరాటం ఎనలేనిదని కొనియాడారు. గతంలో పల్లా శ్రీనివాస్, అచ్చెన్నాయుడులను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడు సీఐడీ ముసుగులో అయ్యన్నపాత్రుడు, రాజేశ్ లను కూడా అరెస్ట్ చేసి ఆటవిక పాలనకు తెర తీశారన్నారు. ఈ అరెస్ట్ లను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందన్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. సీఐడీ అధికారుల దురుసు ప్రవర్తనను కూడా చంద్రబాబు తప్పుపట్టారన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డిని హెచ్చరించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. ప్రజలందరి మద్దతుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదన్నారు. అటువంటి వారిపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ లను వెంటనే విడుదల చేయడంతో పాటు వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని శిష్ట్లా లోహిత్ డిమాండ్ చేశారు.

Comments