అమరావతి :10,నవంబరు (ప్రజా అమరావతి): ఆక్వా రైతులతో సమావేశం
-*మంగళగిరిలోని ఏపీఐఐసీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహణ.
* సమావేశానికి హాజరైన ఏపీ మత్స్య & పశు సంవర్ధక & డెయిరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య,మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు.
* మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కామెంట్స్
*ఆక్వా ఎగుమతుల విషయంలో కొంత ఇబ్బందులున్నాయి.
* చైనా మార్కెట్ పూర్తిగా షట్ డౌన్ అవడంతో ఎగుమతులకు ఇబ్బంది.
* కేంద్రం చైనా ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం.
* రైతులకు స్ధిరమైన ధర ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం.
* ఆక్వాకు సంబంధించిన కంపెనీలు,ఫీడ్,కల్చర్ చేసే వారు,రైతులు,స్టేక్ హోల్డర్లు అందరితో సమావేశమయ్యాం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
* ఆక్వా రైతులకు స్ధిరమైన రేట్లను నిర్ణయిస్తామన్న మంత్రి
* 100 కౌంటుకు 210 రూపాయలు నిర్ణయించిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
* ఆక్వా రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది.
* ఆక్వా రంగంలో ప్రతిష్టంభనలకు కారణం విదేశీ మార్కెట్ లో ఒడిదుడుకులే.
* రైతులు,ఆక్వా కంపెనీలు సమన్వయం కుదిరేలా రేటు నిర్ణయించాం.
* క్రాప్ హాలిడే(పంట విరామం) అనే మాటే లేదు.
* రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
* పది రోజుల పాటు ఇవే రేట్లు ఉంటాయి.
* పది రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహిస్తాం.
* కేంద్ర ప్రభుత్వానికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం.
* మాది రైతుల ప్రభుత్వం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
addComments
Post a Comment