ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది !!

 


 పెడన : 19 నవంబర్  (ప్రజా అమరావతి);


*ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది !!* 



*౼౼ మంత్రి జోగి రమేష్*


మహిళలు, చిన్నారుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్‌ ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వివరించారు.


  శనివారం మధ్యాహ్నం ఆయన పెడనలో జిల్లా గ్రంథాలయ 55 వ వార్షికోత్సవాలలో భాగంగా దిశ చట్టం పై  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 


     ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ హైస్కూలు, కళాశాలకు చెందిన పలువురు విద్యార్థునులతో మాట్లాడుతూ, ప్ర‌భుత్వం గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో దిశాయాప్‌ను రూపోందించి విడుద‌ల చేసిందన్నారు. దీనికి సంబందించి చ‌ట్టాన్ని, దిశా పోలీస్ స్టేష‌న్ల‌ను సైతం తీసుకొచ్చిందన్నారు. దిశా యాప్‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైందిని మంత్రి చెప్పారు. దిశ యాప్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్ష‌న్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చని వివరించారు. డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గానే ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ స‌బ్మిట్ చేసిన త‌రువాత వ్య‌క్తిగ‌త వివ‌రాలు, అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో స‌మ‌యం అందించేందుకు వీలుగా అద‌న‌పు కుటుంబ స‌భ్యుల మొబైల్ నెంబ‌ర్లు ఇవ్వాలని చెప్పారు.

విద్యార్థినులు యువతులు మహిళలకు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి ?. ఎవరికి ఫోన్‌ చేయాలి ?. ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి ?. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి ? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్‌ మాత్రమే అని అన్నారు. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి ? ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై మంత్రి జోగి రమేష్ అవగాహన కల్పించారు. ఇటీవల దుర్మార్గులు పేట్రేగిపోతున్నారని, ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్‌ మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ స్వంత అన్నయ్య తోడు ఉన్నట్టేననే అన్నారు. తొలుత మంత్రి జోగి రమేష్ పలువురు విద్యార్థినులతో ఆప్యాయంగా సంభాషించారు. మీరంతా నా కుటుంబ సభ్యులు.. నా పెడన నియోజకవర్గంలో మీరంతా బంగారు భవిష్యత్తు ఉన్న చిట్టితల్లులు.. చక్కగా చదువుకొని మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలి.. మీకేమైనా ఆపద సంభవిస్తే, నేను ఎవరిని క్షమించనని ఏదైనా ఇబ్బంది పడితే,

నేరుగా తన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆ నెంబర్ వారికి తెలియజేశారు.


      ఈ కార్యక్రమంలో

 పెడన మున్సిపల్ చైర్మన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి, వైస్ చైర్మన్ ఎండి ఖాజా, అభివృద్ధి కమిటీ చైర్మన్ రౌతుల ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, విద్యాశాఖ అధికారిణి జి. మీటల్డారాణి, లైబ్రేరియన్ పాతపాటి సురేష్, పలువురు మహిళ పోలీసులు,

ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments