శ్రీ సత్య సాయి జిల్లాను గ్రీన్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
పుట్టపర్తి, నవంబర్ 8 (ప్రజా అమరావతి): శ్రీ సత్య సాయి జిల్లాను గ్రీన్ జిల్లాగా తీర్చిదిద్దడానికి విరివిగామొక్కలు నాటడానికి కార్యచరణ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కన్ఫరెన్స్ హాల్ నందు ఉద్యానవన శాఖ మరియు సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రెండు నెలల కాలంలో సుమారు లక్ష మొక్కలు నాటడం పై జిల్లాలోని సంబంధితఅధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు , సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధుల, ఆర్డిటి, బ్రహ్మకుమారి సంస్థ, ఎస్కే యూనివర్సిటీ, ఆర్టికల్చర్ యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ భూభాగంలో మూడో వంతు అడవులే ఉన్నాయి. 80% జీవవైవిద్యం అడవుల్లోనే ఉంది అందుకే ఏ దేశానికి ఆదేశం కూడా తమ భూభాగంలో మూడో వంతు అడవి ఉంటే పర్యావరణం సమతుల్యము సాధ్యమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన జిల్లాలో అటవీవిస్తీర్ణం సుమారు 14% ఉంది జాతీయ అటవీపాలసీ 1980 ప్రకారం 33 శాతం గ్రీన్ కవర్ పెంచాలంటే కొండలు, గుట్టలు, ప్రస్తుతం ప్రభుత్వ ఇస్తున్న ఇంటి స్థలాలలో, ప్రభుత్వం ప్రాధాన్తిస్తున్న భవన నిర్మాణాలలో బంజర భూములలో, దేవాదాయ భూములలో, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని అందుకు అందరి సహకారంతో దశలవారీగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు మొదటి దశలలో భాగంగా మూడు వారాల లోపు 40 వేల మొక్కలను వివిధ కళాశాల విద్యార్థుల మరియు యాజమాన్యాల, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అంతట సామాజిక అటవీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. అందుకు సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో 10 నర్సరీలలో సుమారు తొమ్మిది లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని,DWMA ఆధ్వర్యంలో 40 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగాఉన్నాయని తెలిపారు. వివిధపర్యటక ప్రాంతాలలో లేపాక్షి, పెనుగొండ, హిందూపురం, తిమ్మమ్మ మర్రిమాను, కదిరి ప్రాంతాలలో విరివిగా మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టాలని టూరిజంఅధికారులను ఆదేశించారు. పట్టణంలో రహదారుల ప్రక్కన , ఖాళీ స్థలాలలో మొక్కల నాటాలని అందుకు అందరి సహాయం సహకారాలు తీసుకొని మహా యజ్ఞంలో పాల్గొనాలని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు 1/3 వంతు పూర్తయినాయని జనవరి నాటికి అన్ని భవనాలు పూర్తవుతాయని సచివాలయాలు ,రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ వైద్యశాలలు, డిజిటల్ లైబ్రరీల, వైయస్సార్ హెల్త్ క్లినిక్ల,, బి ఎం సి యు/ ఏ ఎం సి య భవనాలు నిర్మాణం పనులు శర వేగం గా జరుగుతున్నాయని తెలిపారు. వివిధ కాలనీలలో ఇంటింటా మొక్కలు పంపిణీ చేసి. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమానిపై ఉండాలని మీరు చెప్పాలని తెలిపారు. అనంతరం సోషల్ ఫారెస్ట్ అధికారిని శ్రీమతి శ్యామల మాట్లాడుతూ జిల్లాలో వివిధ నర్సరీలో మొక్కలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు చింత, నేరేడు, వేప ఉసిరి, టేకు, మొక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో dwmaపిడి రామాంజనేయులు,సత్య సాయిట్రస్ట్ ప్రతినిధి కే చలం, ఆర్ డి టి సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ జెడి సుబ్బా రావు, డి ఆర్ డి ఎ పి డి నరసయ్య , ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, సెరికల్చర్ జెడి ప్రభావతమ్మ, బ్రహ్మ కుమారి సంస్థ ప్రతినిధి శ్రీ లక్ష్మి, ఆర్డబ్ల్యూ ఎస్ ఈ రషీద్, పెనుగొండ మున్సిపల్ కమిషనర్ వంశి, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి, టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment