మనబడి-నాడు నేడు పనుల‌ను సమన్వయంతో చేపట్టాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


*మనబడి-నాడు నేడు పనుల‌ను సమన్వయంతో చేపట్టాలి




* ఆయా పనులను మనస్సు పెట్టి నిబద్దతతో చేపట్టాలి.


* ముందు - తరువాత  కొన్ని స్కూల్స్ చేపట్టిన పనులే ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం


* ప్రతి స్కూల్ లో ఫిర్యాదులు బాక్సు తప్పనిసరి.

* నాడు.. నేడు పనుల్లో అలసత్వం  వహిస్తే చర్యలు తప్పవు..


కలెక్టర్ మాధవీలత


రెండో దశ నాడు.. నేడు పనులను సమర్ధవంతంగా పూర్తి చేయలని అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నిబద్ధత తో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు.


స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో బుధవారం నాడు నేడు రెండో దశ పనులపై ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా లో చేపట్టిన అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులు ఉత్తమ నాణ్యత లో ఉండాలన్నారు. జూనియర్ కళాశాలలకు నాడు నేడు లో  ఆధునిక సౌకర్యాలను, దాతలు ఇచ్చిన ఆర్ ఓ ప్లాంట్ లను పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యయులు తీసుకోవాలన్నారు. 

నాడు నేడు పనుల్లో ఉత్తమ పాఠశాలలకు ,కాలేజీ లు, అంగన్ వాడీలకు ర్యాంక్ లు ఇస్తామన్నారు. ప్రతి స్కూల్ తప్పనిసరిగా ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు. నాడు నేడు పనుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు..నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని  అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు..తాను విజిట్ చేసిన పాఠశాలల్లో గుర్తించిన లోపాలను వివరిస్తూ..పలు సూచనలు చేశారు.పాఠశాల ముఖద్వారం ఆకర్షణీయంగా ఉండాలన్నారు. మంచినీటి వసతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొన్ని పాఠశాల లకు, కళాశాలలకు కొందరు దాతలు ఇచ్చిన ఆర్ ఓ ప్లాంట్ లు నిరూపయోగంగా ఉండటం పై విచారం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణ లో మొక్కలను పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి పాఠశాల లో కంప్లైంట్ బాక్స్ లు విధిగా ఉండాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కంప్లైంట్ బాక్స్ పై టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలన్నారు. నాడు నేడు పనులు జరుగుతున్న చోట సూచిక బోర్డ్ లు విధిగా ఉండాలన్నారు. రాత్రిళ్ళు కూడా సూచిక కనిపించేలా రేడియం స్టికర్స్ అతికించాలన్నారు. నాడు నేడు పనుల ప్రాముఖ్యత ను వివరించడానికి ఈ వర్క్ షాప్ ను జిల్లా లో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు.

జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహాం నాడు నేడు పనుల ప్రగతి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి అంశాన్నీ పూర్తి వివరం గా.. సమగ్ర సమాచారాన్ని అందచేశారు.



ఈ కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్, సి. హెచ్. శ్రీధర్, మునిసిపల్ కమీషనర్, 

కె. దినేష్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి, ఎస్. అబ్రహం, జిల్లా వృత్తి విద్యా శాఖ అధి కారి, ఇంటర్ మీడియట్ విద్య డివై. ఈ. ఓ, జె. వి. ఎస్. సుభ్ర హ్మణ్యం, జిల్లా స్త్రీ శిశు సంక్షే మ శాఖ అధికారి, కె. విజయ కుమారి, పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వర ప్రసాద్, మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ సాంబశివ రావు, ఈ ఈ, పాండు రంగారావు, డిప్యూటీ ఈ. ఓ లు, తిరుమల దాస్, రామన్న దొర, అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్, జిల్లా నుండి దాదాపు 750 మంది వరకూ ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.


Comments