శ్రీ కే. వి రాజేంద్రనాథ్ రెడ్డి,ఐ.పి.ఎస్., గారి నేతృత్వం లో విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగిన ప్రధాన మంత్రి పర్యటన విజయవంతముగా ముగిసింది.


విశాఖపట్నం సిటీ (ప్రజా అమరావతి);



*డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కే. వి రాజేంద్రనాథ్ రెడ్డి,ఐ.పి.ఎస్., గారి నేతృత్వం లో విశాఖపట్నంలో రెండు రోజులపాటు  జరిగిన ప్రధాన మంత్రి పర్యటన విజయవంతముగా ముగిసింది*



       ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రెండు రోజుల పర్యటనతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర వి.ఐ.పిలు, అంతేకాకుండా ఈ కార్యాక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు విశాఖపట్నానికి తరలివచ్చారు. డి‌జి‌పి గారి నిరంతర పర్యవేక్షణలో  నగర పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఉన్నతాధికారులు గత వారం రోజులుగా నగరంలో పరిస్థితులను  ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ఎంతో పగడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేసి, అనునిత్యం పర్యవేక్షిస్తూ రెండు రోజుల కార్యక్రమాన్ని విజయవంతము చేశారు.


    గత రెండు రోజులుగా  గౌరవ డిజిపి గారు నగరంలోనే బస చేసి కార్యక్రమనికి సంభందించిన  భద్రత ఏర్పాట్లు, సభకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర సభా ప్రాంగణాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ  రెండు రోజుల పాటు జరిగిన  ప్రధాన మంత్రి నగర పర్యటన, రోడ్ షో మరియు సభా కార్యక్రమన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయంతంగా నిర్వహించడంలో సహకరించిన వివిధ శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు.   


 

Comments