కార్తీక మహా దీపోత్సవ నిర్వహణకు సహకారం అందివ్వండి

 కార్తీక మహా దీపోత్సవ నిర్వహణకు సహకారం అందివ్వండి


– జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జునకు టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి వినతి

తిరుపతి, 10 నవంబరు (ప్రజా అమరావతి): విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14వ తేదీ టీటీడీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందించాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జునను కోరారు.

గురువారం ఆమె కలెక్టరును కలసి కార్తీక మహాదీపోత్సవం నిర్వహణకు చేపట్టిన పనుల గురించి వివరించారు. పోలీస్, జివిఎంసి, రెవిన్యూ, మత్స్య శాఖ ,అగ్నిమాపక శాఖల నుంచి అవసరమైన సహకారం అందించాలన్నారు. సాయంత్రం 5-30 నుంచి రాత్రి 8 గంటలవరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విశాఖలో టీటీడీ పెద్ద ఎత్తున దీపోత్సవం నిర్వహించడం విశాఖ వాసుల అదృష్టమని కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున చెప్పారు. ఆర్డీవో ను నోడల్ ఆఫీసర్ గా నియమించి అన్ని శాఖల నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.

Comments