రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో రాణించిన తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులను అభినందించిన కలెక్టర్



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో రాణించిన తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులను అభినందించిన కలెక్టర్




నవంబర్ 11,12,13 తేదీల్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో నిర్వహించిన క్రీడల్లో రెండు బంగారు, మూడు సిల్వర్ , ఒక బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్న గోపి, బాపిరాజు లను కలెక్టర్ డా కె. మాధవీలత, జేసీ శ్రీధర్ లు ప్రత్యేకంగా అభినందించారు. 


మంగళవారం రాత్రి వారు గెలిచిన మెడల్స్ కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భగా కలెక్టర్ మాధవీలత ఉద్యోగులు పని వత్తిడి ని అధిగమించేందుకు వారికి ఆసక్తి ఉన్న  క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలన్నరు.  గెలుపు ఓటములకు సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలోని ప్రతిభను చాటుకోవడం ముఖ్యం అన్నారు. జిల్లా తరపున పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా గెలుపు పొందిన వారిని తీసుకోవాలని అన్నారు.


వ్యక్తిగత విభాగాల్లో లాంగ్ జంప్ లో  గోల్డ్ . 200 మీటర్ల పరుగులో గోల్డ్ , 100 మీటర్ల పరుగులో కాంస్యం . 400 మీటర్ల పరుగులో  సిల్వర్ సాధించిన ఎన్. గోపీచంద్ (జేసీ సి సి) ను కలెక్టర్, జేసీ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా  గ్రూప్ విభాగాల్లో  రన్నింగ్ 4*100 రిలే లో సాధించిన  డిప్యూటీ తహశీల్దార్ జీ. బాపిరాజు లతో పాటు ఎన్. గోపీచంద్, చిన్నా, స్వామి రజత పతకం సాధించారు. 

టెన్నికాయిట్ డబుల్స్  విభాగంలో డిప్యూటీ తహశీల్దార్ జీ. బాపిరాజు, జేసీ సిసి ఎన్. గోపీచంద్ లు రజత పతకం సాధించడం జరిగింది.  ఈ సందర్భంగా పలువురు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది గోపి, ఇతర క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.



Comments