డిమాండ్ లేని కోర్సుల స్థానంలో కొత్త కోర్సులు



డిమాండ్ లేని కోర్సుల స్థానంలో కొత్త కోర్సులు


ఎస్సీ గురుకులాల్లో ఎంఇసి స్థానంలో ఎంపీసీ బైపీసీ

వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం

అమరావతి, నవంబర్ 07 (ప్రజా అమరావతి): ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ లో విద్యార్థుల నుంచి పెద్దగా డిమాండ్ లేని ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.

బీ.ఆర్.అంబేద్కర్ గురుకులాల కార్యకలాపాలపై సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో నాగార్జున అన్ని అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గురుకులాల్లో మొత్తం 1.17 లక్షల సీట్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 1.09 లక్షల సీట్లు భర్తీ కావడం జరిగిందని చెప్పారు. ఖాళీగా మిగిలిపోయిన సీట్లలో ఎక్కువగా ఇంటర్మీడియట్ కు చెందిన సీట్లే ఉన్నాయని తెలిపారు. ఇంటర్ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఇసి సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంఇసి కోర్సుల స్థానంలో విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు జాబ్ గ్యారెంటీ ఇచ్చే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఎస్సీ గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడానికి అమలు చేస్తున్న విధానాలపై ప్రిన్సిపాళ్లు, డీసీఓలు దృష్టి పెట్టేలా చూడాలని, ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే ప్రిన్సిపాళ్లు, డీసీఓలపై చర్యలు తీసుకోవాలని కూడా నాగార్జున అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. బాగా చదివి మంచి మార్కులు సాధించే విద్యార్థులకు తరగతుల స్థాయిలో ప్రోత్సాహక బహుమతులను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 189 గురుకులాల్లో 181 గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 8 గురుకులాలకు సంబంధించిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించగా కొత్త భవనాల నిర్మాణాలను శీఘ్రగతిన పూర్తి చేయాలని, రాష్ట్రంలో శిధిలావస్థకు చేరినట్లుగా గుర్తించిన మరో 13 భవనాల నిర్మాణాన్ని కూడా వచ్చే ఏడాది చేపట్టాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించి గురుకులాలు, హాస్టళ్లు, ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన కాంప్లెక్సులు, లిడ్ క్యాప్ కు చెందిన భవనాలు ఉండగా వీటికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను, నిర్వహణను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం అవసరం అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ని కోరారు. గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను, కేర్ టేకర్లు, లైబ్రేరియన్ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్ల వేతనాలను సవరించే విషయాన్ని రాబోయే బీఓజీ సమావేశంలో పెట్టి తీర్మానించాలని కోరారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, క్యాంపస్ క్లీనింగ్ కోసం చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ తదితర కార్యక్రమాలను కూడా మంత్రి సమీక్షించి సూచనలు చేసారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, ఎఎంఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image