పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్న జగన్ రెడ్డి అండ్ కో

 మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్  మీడియాతో మాట్లాడుతూ


పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్న జగన్ రెడ్డి అండ్ కో


జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రూ.7వేల కోట్ల బియ్యం తినేశారు

ఇంటింటికీ రేషన్ వాహనాలతో.. పేదోడి బియ్యాన్ని దోచేస్తున్న జగన్ గ్యాంగ్

5.66 లక్షల టన్నుల బియ్యం లెక్కల్లేవని కేంద్ర మంత్రి చెప్పినా సిగ్గులేదా

నవరత్నాల పేరుతో పేద వాడి నవ నాడుల్నీ పిండేస్తూ జేబులు నింపుకుంటున్నారు

మంగళగిరి (ప్రజా అమరావతి);

ఏ పేద వాడు కూడా ఆకలితో ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది. అన్న నందమూరి తారకరామారావు దేశంలోనే తొలిసారిగా రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాంటి మహత్తరమైన పథకాన్ని నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులుంటే.. వాటిని 1.44 కోట్లకు కుదించారు. వారికి సుమారు 30వేల రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరిగేది. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేకుండా రేషన్ డీలర్లు సరుకుల్ని పంపిణీ చేస్తే.. ఇంటింటికీ రేషన్ పేరుతో జగన్ రెడ్డి ఆ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టుపట్టించారు. మూడేళ్ల క్రితం వరకు 95 శాతం వరకు రేషన్ తీసుకుంటే.. దాన్ని 80 శాతం మించకుండా జగన్ రెడ్డి నాశనం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమైంది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.2వేల కోట్ల విలువైన సుమారు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టాయని కేంద్ర మంత్రి పార్లమెంటులోనే చెప్పారు. ఇప్పటి వరకు మట్టి, ఇసుక, మద్యం మాఫియాలతో ప్రజల్ని దోచుకుతిన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రజల ఆకలి తీర్చే బియ్యాన్నీ అడ్డగోలుగా బొక్కేస్తున్నారు. జగన్ రెడ్డి మాఫియా పేదల బియ్యాన్నీ బొక్కేస్తోంది. 

పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. పేదల తిండిని కూడా లాగేసుకోవడం సిగ్గుచేటు. వేల కోట్ల వ్యయంతో ఇంటింటికీ వాహనాలు అన్నారు. వారు వీధి చివరకు బియ్యం తెచ్చి అక్కడకు వచ్చేవారికే బియ్యం ఇస్తామంటున్నారు. అదే సమయంలో సుమారు 30 వేల మంది రేషన్ డీలర్ల పొట్టకొట్టారు. గతంలో డీలర్లు బియ్యం అమ్మకాలతో వచ్చే కమిషన్ తో  కొంత ఉపాధి పొందేవారు. వారికి ఇప్పుడు ఆ ఉపాధిని దూరం చేశారు. పేదలకు పంపిణీ కూడా జరగడం లేదు. 

రేషన్ పంపిణీ వాహనాలతో ఆర్భాటం చేస్తూ.. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని వారితోనే  కొనుగోలు చేయించి పేదల పొట్ట కొడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ నుండి బియ్యం ఎగుమతులు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు పంటల సాగు తగ్గిందని చెబుతూనే.. ఏకంగా బియ్యం ఎగుమతులు 35 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి.  ఇది ఎలా సాధ్యమైందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అది కూడా విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో కంపెనీకి కాకినాడ పోర్టును అప్పగించిన తర్వాతనే ఈ ఎగుమతులు ఏకబిగిన పెరగడం, అందులోనూ ఆ బియ్యం ఎక్కువగా ఆఫ్రికా దేశాలు, ఐవరీ కోస్ట్ వంటి దేశాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండడంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. వాటిని జగన్ రెడ్డి తీర్చాలి. పేదల రేషన్ బియ్యమే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కాకినాడ పోర్టును మాఫియాకు కేంద్రంగా మార్చుకుని స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా మొత్తం నడుస్తోందనడం నిజం కాదా?  ఈ మాఫియా మొత్తాన్ని వెనకుండి నడిపిస్తున్నది జగన్ రెడ్డి కాదా?

పేదల తిండిని కూడా బొక్కేస్తున్న జగన్ రెడ్డి పేదల ముఖ్యమంత్రా? గతంలో ఎన్నడూ లేని విధంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఘటనలు ఇప్పుడే ఎందుకు  ఎక్కువగా పట్టుబడుతున్నాయి? పేదల పొట్ట కొడుతూ.. ఆ బియ్యాన్ని అమ్ముకోవడం వాస్తవం కాదా? గుంటూరు జిల్లా నర్సరావుపేట, రొంపిచర్లలో గోపిరెడ్డి అనుచరులు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడడం వాస్తవం కాదా?  నర్సరావుపేటలో వైసీపీ నేతల భియ్యం కుంభకోణాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేయడం నిజం కాదా? నిన్నటికి నిన్న తంబళ్ల పల్లెలో కోట్లాది విలువైన రేషన్ సరుకులు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడడం నిజం కాదా? ఇది పేదల నోట్లో మట్టి కొట్టడం కాదా జగన్ రెడ్డీ?

నవరత్నాల పేరు చెబుతూ.. పేదల నవ నాడుల్నీ నాశనం చేసేస్తున్నారు. పేదల పొట్ట కొట్టే ఏ ఒక్కరూ బాగుపడింది లేదనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. బియ్యం అక్రమ మాఫియాకు ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తుండడం నిజం కాదా?

కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. ఆ బియ్యాన్ని కూడా పేదలకు పంచకుండా చేతులెత్తేసిన జగన్ రెడ్డి.. పేదలకు అండగా ఉన్నానని చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ఇచ్చే బియ్యం తప్ప ఇంకెవరికీ ఇవ్వలేమని మంత్రి అధికారికంగా ప్రకటించారంటే అంతకంటే సిగ్గుమరొకటి ఉంటుందా? కరోనా బాధితుల సొమ్మును మింగేసిన జగన్ రెడ్డి.. పేదల బియ్యాన్ని దోచేయడంలో ఆశ్చర్యం ఏముంది? పేదల తిండిని కూడా దొబ్బితినే దుర్మార్గ పాలనకు ప్రజలు తరిమేసేయడం ఖాయం. 

2019 ముందు వరకు బియ్యం, కందిపప్పు, ఉప్పు, చిరు ధాన్యాలు సహా సుమారు 9 రకాల సరుకులు అందేవి. కానీ.. చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వడం లేదన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదా? పేదలకు పండగ కానుకలు కూడా అందించి అండగా నిలిచాం. కిలో కందిపప్పు రూ.40 చొప్పున రెండు కిలోలు ఇస్తే.. రూ.67 చేశారు. అది కూడా గత ఏడాదిగా నిలిపేశారు. పంచధార ధరనూ పెంచారు. ఎంతో ఆర్భాటంగా ఉద్దరించేస్తున్నామని పేపర్లలో యాడ్స్ ఇచ్చుకోవడం తప్ప పేదలకు జగన్ రెడ్డి చేసిందేమిటి?  సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరుతో తెచ్చిన రూ.43వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి. ఆ డబ్బు మొత్తం ఏమైందో సమాధానం చెప్పాలి.

బహిరంగ మార్కెట్లో ధరలు నియంత్రించే పరిస్థితి లేదు. రేషన్ షాపుల్లో సరుకులు ఇచ్చిందీ లేదు. ఇదేనా పేదలకు అండగా నిలవడమంటే? పేదల బియ్యాన్ని బొక్కేసి రూ.7వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి ప్రజల్ని ఉద్దరిస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ రెడ్డీ.. ప్రజా కంటక విధానాలు మానుకోకుంటే ప్రజలు తిరగబడడం ఖాయమని గుర్తుంచుకోవాలి.

పోలీసు వ్యవస్థ తమ నెత్తిపై ఉండే సూక్తిని జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా మరిచిపోయారు. గత డీజీపీ వైసీపీ నేతల దాడుల్ని సమర్ధించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ దాడుల్ని, దౌర్జన్యాలను వెనకేసుకు వచ్చారు. ప్రస్తుత డీజీపీ అంతకు మించిన ఘనుడు. పూలతో పాటు రాయి వచ్చిందని చెప్పి సమర్ధించడం చూస్తుంటే.. జగన్ రెడ్డికి ఎంత దారుణంగా వెనకేసుకొస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రతిపక్ష నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడిపై దాడి జరిగితే.. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అతని అసమర్ధతకు నిదర్శనం. చట్ట ప్రకారం పని చేస్తే.. ఆ చట్టమే రక్షిస్తుందనే విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలి.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image