ప్రజల్లో చైతన్యం తీసుకురానున్న నారా లోకేష్ పాదయాత్ర



 *- ప్రజల్లో చైతన్యం తీసుకురానున్న నారా లోకేష్ పాదయాత్ర


 *- 2023 జనవరి 27న కుప్పం నుండి ప్రారంభం* 

 *- ఏడాది పాటు ప్రజల మధ్య ఉండే విధంగా రూట్ మ్యాప్* 

 *- యువత భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


గుడివాడ, నవంబర్ 11 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 2023 జనవరి 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి ఇచ్ఛాపురం వరకు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోందన్నారు. ముఖ్యంగా యువత అన్నిరంగాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతూ వస్తున్న రైతుల, మహిళల సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు యువతను కూడా పెద్దఎత్తున భాగస్వాములుగా చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల నుండి ప్రతిపక్ష నాయకుడి వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వైసీపీ గూండాలు ఎలా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి నందిగామ రోడ్ షోలో రాళ్ళ దాడులు చేశారన్నారు. పైగా దాడులకు పాల్పడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోడ్లపై గుంతలను పూడ్చలేని ప్రభుత్వం పేదల ఇళ్ళ కూల్చివేతలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ళ కూల్చివేతలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందన్నారు. కొన్ని చోట్ల న్యాయ సహాయం చేసి కూల్చివేతలను అడ్డుకోవడం జరిగిందన్నారు. రాజకీయ కక్షతోనే ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూల్చివేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటం గ్రామంలోనే ఎందుకు జరిగిందో ప్రజలకు అర్ధమైందన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ గెలిస్తే ఇళ్ళు కూల్చివేస్తారని అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. మంగళగిరిలో ఇప్పుడు పేదల ఇళ్ళు కూల్చుతుంది ఎవరో ప్రజలు గ్రహించారన్నారు. వచ్చే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలని, తెలుగుదేశం పార్టీ పాలన రానుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image