ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు, కల్పిస్తున్న వసతులను పరిశీలించిన మంత్రి



విజయనగరం (ప్రజా అమరావతి);: 

 రాష్ట్రం లోనే అతి పెద్ద లే అవుట్ లలో ఒకటైన గుంకలాం జగనన్న హౌసింగ్ లే అవుట్ ను సందర్శించిన గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్


 ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు, కల్పిస్తున్న వసతులను పరిశీలించిన మంత్రి



 ఇటుకల తయారీ గురించి ఆరా తీసి ఉత్పత్తిని మరింతగా పెంచాలని ఆదేశించిన మంత్రి జోగి రమేష్


 గుంకలాం లే అవుట్ సందర్శన లో పాల్గొన్న ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి బెల్లాన చంద్రశేఖర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ దొరబాబు 


 అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి రమేష్


 రాష్ట్రంలో జగనన్న గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి 


 గుంకలాం లే అవుట్ లో 12,216 ఇళ్లను మంజూరు చేస్తే 10,600 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము : మంత్రి జోగి రమేష్


 ఇళ్ల నిర్మాణానికి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇళ్ల నిర్మాణం ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది


 ఈ లే అవుట్ ను గతంలో సందర్శించిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇక్కడ కమాన్ తప్ప ఏమీ లేదన్నారు


 ఏ ఒక్క లబ్దిదారుడైనా తమకు ఇళ్ల నిర్మాణం లో ఇబ్బందులు ఎదురయ్యాయనీ చెప్పారా?


 ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో కనీసం పరిశీలన చేయకుండా చౌకబారు మాటలు మాట్లాడారు 


 రాష్ట్రంలో 2.50 నుంచి 3 లక్షల కోట్ల విలువైన ఆస్తిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నమ్


 ఇళ్ల నిర్మాణం పై పవన్ కళ్యాణ్ ఎక్కడకు చర్చకు వచ్చినా సిద్ధం : మంత్రి జోగి రమేష్



Comments