విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాల పెంపుకు, గ్లోబల్ సిటిజన్లు గా తీర్చిదిద్దేందకు చర్యలు
విజయవాడ (ప్రజా అమరావతి);


*విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాల పెంపుకు, గ్లోబల్ సిటిజన్లు గా తీర్చిదిద్దేందకు చర్యలు*అన్ని యూనివర్సిటీల్లో పారదర్శకంగా ఖాళీలు భర్తీ చేయమని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ*

 

*కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు, రాస్తున్న కథనాలు అవాస్తవం*


*ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి వెల్లడి*


                 గత మూడున్నరేళ్లుగా విద్యావ్యవస్థలో మరీ ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని బందర్ రోడ్డులో గల ఆర్ అండ్ బి భవన సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, యువతను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సిటిజన్లు గా తయారు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, తీసుకున్న చర్యలు, నాణ్యత ప్రమాణాలు పెంచడానికి చేస్తున్న కృషి ఇంతవరకూ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం చేయలేదన్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వం మీద పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు, విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.


              2018లో అప్పటి ప్రభుత్వం హడావిడిగా యూజీసీ నిబంధనలకు భిన్నంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్లు, గైడ్ లైన్స్ ను పాటించకుండా యూనివర్సిటీల ద్వారా 2,000 పోస్టులతో విడుదల చేసిన  నోటిఫికేషన్ లో చాలా లొసుగులున్నాయన్నారు. రూల్స్ ను ఉల్లంఘిస్తూ రిక్రూట్ మెంట్ విషయంలో రేషనలైజేషన్, రోస్టర్ పాయింట్లు  పాటించలేదనే వివిధ అంశాల మీద 70 కోర్టు కేసులు వేశారన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ పొజిషన్స్ పూర్తి అసంబద్ధంగా ఉండటంతో చాలా వరకు సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఈ క్రమంలో 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సమీక్ష చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి 2,000 పోస్టులకు అదనంగా మరో 1,000 పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారా 3,000 అసిస్టెంట్ ప్రొఫెసర్ ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామన్నారు.  గత 15 యేళ్లుగా యూనివర్సిటీల్లో ఏ విధమైన రిక్రూట్ మెంట్ లు జరగకపోగా పలువురు పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని యూనివర్సిటీల్లో పారదర్శకంగా ఖాళీలు భర్తీ చేయమని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐఐఐటీలను తీసుకురావడం జరిగిందని, గత ప్రభుత్వంలో శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీల్లో ఎలాంటి బడ్జెట్ లు కేటాయించకుండా అక్కడి  విద్యార్థులను నూజివీడు, ఇడుపులపాయ ఐఐఐటీల్లో పరీక్షలు రాయించిన దుస్థితి నెలకొందన్నారు. అంతేగాకుండా ఏ విధమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు లేకుండా రూ.450 కోట్లకు బిల్డింగ్ టెండర్లను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  శ్రీకాకుళంలో క్లాసులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేశారన్నారు. ఒంగోలు క్యాంపస్ కు రూ.1,206 కోట్లతో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే సంబంధిత పనులు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే 9,000 ల్యాప్ టాప్ లు విద్యార్థులకు అందించడం జరిగిందని, త్వరలో మరో 6 వేల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం లాగేసుకుంటుందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల రాష్ట్రంలో నాక్ గుర్తింపు కాలేజీల సంఖ్య పెరగిందని వివరాలు వెల్లడించారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల దేశంలోనే ఉమెన్ గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరగడం అభినందనీయమని హేమచంద్రారెడ్డి అన్నారు.


             సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం  రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) కి చెందిన రూ.180 కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రూ.150 కోట్లు, అదే విధంగా వివిధ యూనివర్సిటీల నిధులను  పసుపు-కుంకుమ కార్యక్రమానికి మళ్లించిందని, ఇప్పటివరకు వాటికి సంబంధించి లెక్కలు లేవన్నారు. ఈ ప్రభుత్వం యూనివర్సిటీలో మిగిలిన నిధులను మాత్రమే ఎక్కువ వడ్డీకి రిజిస్ట్రార్ పేరు మీదుగా ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయడం జరిగిందని సాంబశివారెడ్డి అన్నారు. 


 

         ఈ సమావేశంలో ఏపీసీహెచ్ఇ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image