అటవీయేతర భూముల్లో పెద్ద ఎత్తున ఉద్యానవనాలను ప్రోత్సహిస్తాం



- అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

- ముఖ్య అతిథిగా హాజరైన అటవీశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు సీఎం శ్రీ వైయస్ జగన్ అధిక ప్రాధాన్యం

- 33 శాతంకు అడవుల విస్తీర్ణం పెంచాలన్నది సీఎం లక్ష్యం

- జగనన్న పచ్చతోరణం, సోషల్ ఫారెస్ట్, నరేగా ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం

- అడవులతోనే మానవ మనుగడ సాధ్యం

- ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు చేయిస్తున్నాం

- అటవీయేతర భూముల్లో పెద్ద ఎత్తున ఉద్యానవనాలను ప్రోత్సహిస్తాం


- యుఎస్ఎయిడ్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి సహకారం అందిస్తాం


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


విజయవాడ (ప్రజా అమరావతి):


1) ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని పెంచడానికి సీఎం శ్రీ వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అటవీశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనే లక్ష్యాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ధేశించారని తెలిపారు. విజయవాడలో  యుఎస్ ఎయిడ్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖల ఆధ్వర్యంలో అటవీయేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకం (టిఓఎఫ్ఐ)  కార్యక్రమం పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా  జ్యోతీప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టిఓఎఫ్ఐ బ్రోచర్ లను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...


2) యుపి, హర్యానా, రాజస్థాన్, అస్సాం, ఒడిస్సా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకం కార్యక్రమంను అమలు చేసేందుకు కేంద్ర అటవీమంత్రిత్వ శాఖ, యుఎస్ఎయిడ్ సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వృక్షసంపద ద్వారా ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. 


3) ఈ కార్యక్రమం ప్రారంభించిన తరువాత కొత్తగా 2.8 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అటవీయేతర భూముల్లో చెట్లు వృద్ది చెందడం శుభపరిణామం అన్నారు. ఒక ఏడాదికి 30 నుంచి 45 చెట్లు ఏకంగా ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సీజన్ ను అందిస్తున్నాయని, చెట్ల ప్రాధాన్యత ఏమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని అన్నారు. అటవీయేతర భూముల్లోని చెట్లు 420 మిలియన్ టన్నుల కార్భన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని, ప్రాణవాయువును అందిస్తున్నాయని, ఈ వృక్ష సంపద వల్ల దాదాపు 1.31 కోట్ల మంది జీవనోపాధి అవకాశాలను పొందుతున్నారని అన్నారు.


4) ఆంధ్రప్రదేశ్ లోనూ పచ్చదనంను మరింతగా వృద్ది చెందేలా చేసేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో జగనన్న పచ్చతోరణం కింద దాదాపు కోటీ ఇరవై లక్షల మొక్కలను నాటామని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద సుమారు 17 వేల కిలోమీటర్ల పరిధిలో దాదాపు 65 లక్షలకు పైగా మొక్కలను నాటామని వెల్లడించారు. 


5) వినూత్నంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ ప్రాంతంలో ఎటువంటి మొక్కలు పెరుగుతాయో శాస్త్రీయంగా నిర్ధారించి రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఒక్క చిత్తూరు జిల్లాల్లోనే లక్షల ఎకరాల్లో మ్యాంగో ప్లాంటేషన్ చేసి, ప్రజల ఆర్థిక ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ఉద్యానవనాల ద్వారా పెద్ద ఎత్తున పండ్లతోటలను పెంచడం, రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి, వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించడమే కాదు, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలను కూడా అందిస్తున్నామని అన్నారు. అటవీయేతర ప్రాంతాల్లో పచ్చదనం కోసం సచివాలయాల్లో అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 


6) గత ఏడాది COP-26 (Glasgow)లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యావరణ ఒప్పందాలపై కీలక సంతకాలు చేశారని, దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం విధించారని అన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని మన రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్లాస్టిక్ వినైల్, ఫ్లెక్సీలపై నిషేదం విధించారని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి ప్రతికూలతలను ఎదుర్కొంటున్నామని, దీనిని నియంత్రణలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అడవులు, అటవీయేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకంను ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. 


7) రాష్ట్రంలో అర్భన్ ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు అహ్లాదాన్ని పంచే పచ్చదనం, ఆరోగ్యకరమైన పరిసరాలు, స్వచ్ఛమైన గాలిని అందించేలా నగరవనాలను తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రాంతాలను ఎంపిక చేశాం. ఈ ఏడాది సుమారు రూ.15 కోట్లతో 16 నగర వనాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 


8) అటవీయేతర భూముల్లో మొక్కల పెంపకం ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధితో పాటు పశుసంపద, కలప, అటవీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రభుత్వ చేయూత ఉంటుందని, అటవీశాఖ ద్వారా సంపూర్ణ సహకారంను అందిస్తామని హామీ ఇచ్చారు. 


9) ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, యుఎస్ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, చీఫ్ ఆఫ్ పార్టీ (టిఓఎఫ్ఐ) డాక్టర్ చంద్రశేఖర్, యుఎస్ఎయిడ్ డిప్యూటీ డైరెక్టర్ వర్గీస్ పౌల్, పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image