భారత రాజ్యాంగం గొప్ప మార్గనిర్దేశం జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 భారత రాజ్యాంగం గొప్ప మార్గనిర్దేశం


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్




పుట్టపర్తి, నవంబరు 26 (ప్రజా అమరావతి): భారత రాజ్యాంగం దేశ పౌరులకు గొప్ప మార్గనిర్దేశమని జిల్లా  కలెక్టర్  బసంత కుమార్   పేర్కొన్నారు


శనివారం   స్థానిక  కలెక్టరేట్లోనూ స్పందన హాలు నందు భారత రాజ్యాంగం ప్రస్తావన ఘనంగా జరిగింది. ఈ సదర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ  భారత రాజ్యాంగం దేశ పౌరులకు స్వేచ్చగా జీవించే హక్కును కల్పించిందన్నారు. పౌరులకు కొన్ని హక్కులు కల్పించడం ద్వారా స్వేచ్చగా మాట్లాడటం, సమాన న్యాయం పొందడం జరుగుతోందని చెప్పారు. భారతరత్న డా. బాబూ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షులుగా రూపొందిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని తెలిపారు. అనేక మంది పెద్దలు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని తయారు చేసి దిశా నిర్దేశం చేశారని అన్నారు. నిత్య జీవితంలో ప్రజలు  ఏవిధంగా నడుచుకోవాలో స్పష్టమైన సూచన చేసిందని ఆయన చెప్పారు.  ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగము ఉండాలని తెలిపారు


కులమతాలకు అతీతంగా  ప్రతి ఒక్కరికీ అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యంతో డా. బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిచుకొన్న రాజ్యాంగాన్ని  1949 నవంబర్ 26 న ఆమోద ముద్ర చెయ్యడం, మనం ఇప్పటికీ అమలు చేస్తున్నామంటే, ఎంత పకడ్బందీగా రాజ్యాంగాన్ని రూపొందించారో అర్థమవుతుందని జిల్లా కలెక్టరు  అన్నారు.


ఈ సందర్బంగా భారత రాజ్యాంగము.. ప్రస్తావన.. లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   తాసిల్దారులతో మరియు ఎంపీడీవోలతో  భాగంగా  జిల్లా కలెక్టర్ అధికారులచేత  ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.


"భారతదేశ  ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు అందలి పౌరులెల్లరకు..సామాజిక, ఆర్ధిక,రాజకీయ- న్యాయమును, భావము, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనా – స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములలోను - సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యత మరియు అఖండతను చేకూర్చు సౌభ్రాతృత్వమును, పెంపొందించుటకు, సత్యనిష్టా పూర్వకముగా తీర్మానించుకొని,1949వ సంవత్సరము నవంబరు ఇరువదియారవ దినమున మా రాజ్యాంగ సభయందు ఇందుమూలముగా, ఈ రాజ్యంగమును అంగీకరించి, అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకొన్నవారము.

 ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ మరియు పుట్టపర్తి ఆర్డిఓ శ్రీమతి భాగ్య రేఖ, స్పందన తహల్దార్ గోపాలకృష్ణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

  

Comments