కార్తీక మాసం సకల శుభప్రదం
మాజీ ఎమ్మెల్యే సాయికల్పనా రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు (ప్రజా అమరావతి): గిద్దలూరు పట్టణంలోని శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఆవరణమునందు వెలసి ఉన్న శ్రీ శ్రీ గాయత్రీ మాత గుడి నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూనూరు హనుమంత రెడ్డి పాల్గొని గాయత్రి మాత యజ్ఞం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయికల్పనారెడ్డి, సూరం నారాయణరెడ్డి విశ్రాంత తెలుగు లెక్చరర్ పాల్గొని మాట్లాడుతూ దక్షిణాయనంలో వచ్చే ప్రశస్తమైన పండుగలలో కార్తీకమాసం ప్రధానమైనది. ఈ మాసంలో దీపం, దానం, స్నానం ,జపం, ఆలయ సందర్శనం ప్రధానమైనదని మనుషుల మధ్య కుటుంబ బాంధవ్యాల సామాజిక జీవన ప్రగతి సాంఘిక సంఘసేవ ఇవన్నీ ఇమిడి వచ్చేటట్లుగా మన పెద్దలు ఈ పండుగను నిర్దేశించి జరుపుచున్నారు. సత్కర్మ, సంజన, సాంగత్య, సాంగత్యం వలన దుర్జన త్వం తొలగి పోయాయని సూరం నారాయణరెడ్డి అన్నారు. భగిని హస్తభోజనం అన్నా చెల్లెల్లు అక్క తమ్ముళ్లను వాళ్ళ అనురాగ బాంధవ్యాలను తెలియజేసే పండుగ కార్తీక మాసం పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు, విశ్రాంత డివిజనల్ సర్వేయర్ రెడ్డి మల్లారెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఆదినారాయణ రెడ్డి చిన్ని సేవ సంస్థ వ్యవస్థాపకులు మాగులూరు శ్రీకాంత్, మారంరెడ్డి నాగిరెడ్డి, విజయమ్మ, ప్రసూనలక్ష్మి లాయర్ నిరంజన్ ఈ కార్యక్రమంలో డాక్టర్ శనివారపు భాను కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్న భక్తాదులకు అల్పాహారం ఏర్పాటు చేశారు గాయత్రి పరివార్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
addComments
Post a Comment