మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం

 *మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం*



*వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు*


*ఇంతటి దారుణమైన..నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు*


*నారా చంద్రబాబు నాయుడు*


గుంటూరు (ప్రజా అమరావతి): ఇంతటి దారుణమైన..నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, గత మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత  నారా బ్చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ‘ఇదేం ఖర్మ’ పేరిట కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ దారుణాలన్నీ పోలీసుల సహకారంతో ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నా అంతే బాధ్యతగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. 


*మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం*

 

ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ అధినేత ప్రారంభించారు. జాతీయ భావాలతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం అని, ప్రాంతీయ భావాలతోనే కాకుండా జాతీయ భావాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అదే బాధ్యతగా ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో టీడార్ఒక నమూనా అని,  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం అని తేల్చిచెప్పారు. మూడున్నరేళ్లుగా టీడీపీపై దాడులు చేస్తూనే ఉన్నారని, రాత్రిళ్లు అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణ, నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీసులను రంగంలోకి దింపారు. తునిలో తెదేపా నేత మీద హత్యాయత్నం జరిగితే ఆ పోలీసులు ఎక్కడున్నారు? నాపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ పూలల్లో రాళ్లున్నాయన్నారు.. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? నాపై రాళ్లేస్తే భయపడి పర్యటనలు మానుకుంటానని అనుకుంటున్నారా? అచ్చెన్నాయుడిని వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడటం లేదు. ఇవాళే కాదు.. రేపు అనేది కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.


మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి సీఎం జగన్‌ చలికాచుకుంటున్నారని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి జగనేనన్నారు. కర్నూలు జిల్లాకు ఎవరేమి చేశారో తేల్చుకోవడానికి చర్చకు రావాలని అధికార పార్టీకి సవాల్​ విసిరారు. మూడు రాజధానులు అంటున్న వారంతా అమరావతి రాజధానికి జగన్‌ అంగీకరించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు


175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయి. కుప్పం నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని నేను భావించేవాడిని. కుప్పం ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నంచాను. ఇక్కడ పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని. అలాంటి నియోజకర్గంలో ఇప్పుడు ఈ వైసీపీ దుర్మార్గులను ఎదుర్కోవడానికి నేనే లాయర్లు ఎతుక్కునే పరిస్థితి వచ్చింది. కుప్పంలో 70 మందిని అరెస్టు చేసి 20 రోజులు జైళ్లలో పెట్టారు. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సైకోలను కట్టడిచేయాలంటే తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలపై ప్రోయాక్టివ్ గా పనిచేయాలి.

పోలీసులు అప్రజాస్వామికంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడానికి వస్తే ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో అడిగి రాతపూర్వక నోటీసులు అడగాలి. బ్యాడ్జ్ లేకుండా వస్తే బ్యాడ్జ్ పెట్టుకోమని అడగండి. ఇదే సమయంలో లోకల్ పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాల రికార్డింగు చేయమని అడగండి. 

నా స్టూడెంట్స్ డేస్ నుంచి ఐపీసీ సెక్షన్లు చదువుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ, జగన్ రెడ్డి చట్టవ్యతిరేక పాలన కారణంగా నేడు వాటిని తెలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 


*హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదు*


హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదు. హౌస్ అరెస్టులు చేయాలంటే ఇంటిని జైలుగా మార్చేందుకు పోలీసులు పర్మీషన్ తీసుకోవాలి. బాబ్లీ అంశంలో మహారాష్ట్రకు మేం వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు మమల్ని అరెస్టు చేసి మేమున్న హాస్టల్ ను జైలుగా మార్చి మమ్మల్ని అక్కడే ఉంచారు. అలా చేయకపోతే వారికి మమ్మల్ని హౌస్ అరెస్టు చేసే అధికారం లేదు. ఒకవేళ అరెస్టు చేస్తే అది చట్టవ్యతిరేకం అవుతుంది. ప్రతీ నియోజకవర్గంలో లీగల్ టీంలు లీగల్ స్క్రుటినీ చేసి కార్యకర్తలకు లీగల్ సహాయం అందించాలి. 27 దళిత పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నించినందుకు గుడివాడలో ఒక మహిళ మహిళపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం. 


*చెంగల్రాయుడు:*


పోలీసులు ఫోన్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు వాయిస్ రికార్డులు చేయాలి. పోలీసులు మీ ఇళ్లకు వచ్చి స్టేషన్ కు రమ్మంటే రాతపూర్వక నోటీసును అడగాలి. 7 సంవత్సరాల లోపు శిక్షపడే నేరాలపై పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి. రిమాండ్ రిపోర్టు కూడా రాయకుండదు. అలాకాదని చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అది కంటెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. ఇది చట్టం. మంగళగిరి  కోర్టు, ఆ తీర్పుపై హైకోర్టు ఒపీనియన్ చారిత్రాత్మకమైని. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరం.

Comments