విద్యార్థుల సమగ్రాభివృద్ధికి వినూత్న పథకాలు



విద్యార్థుల సమగ్రాభివృద్ధికి వినూత్న పథకాలు



ఇతర గురుకులాల్లో లేని విధంగా ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనలు

ఆరోగ్యాల పరిరక్షణకు సునిశిత పరీక్షలు

ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, నవంబర్ 03 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ఇతర గురుకులాల్లో లేనివిధంగా ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులకు విద్య, వైద్యం, ఆరోగ్యాల మెరుగుదల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విద్యార్థులతో పాటుగా అధ్యాపకుల వికాసానికి అవసరమైన ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. 

ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అన్ని విధాలుగా విద్యార్థులను అభివృద్ది చేయడానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ, టీసీఎస్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీసీఎస్, ఈ విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ లాంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విద్యాభివృద్ధిలో భాగంగా సూక్ష్మస్థాయి పరిశీలన కోసం వారాంతపు పరీక్షలను నిర్వహించే ప్రక్రియను గత నెలలో ప్రారంభించామని చెప్పారు. 5 నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మ్యాథ్య్, సైన్స్, ఇంగ్లీష్ లలో వాలంటీర్ల ద్వారా వీడియో క్లాసులు, లైవ్ క్లాసులను నిర్వహిస్తున్నామని, గత ఆగష్టు నుంచి ఇప్పటి వరకూ 395 లైవ్ క్లాస్ లను నిర్వహించడం జరిగిందని  తెలిపారు. ఎస్సీ గురుకులానికి చెందిన పూర్వ విద్యార్థులలో ఐఐటి, మెడికల్ విద్యలను అభ్యసించిన వారితో స్వచ్ఛందంగా జేఇఇ, నీట్ పరీక్షలకు సంబంధించిన అంశాల బోధన చేయిస్తున్నామన్నారు. విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ‘విద్యార్థి విద్యాన్ మంతన్’ అనే కార్యక్రమాన్ని ఎన్.సి.ఆర్.టి సహకారంతో అమలు చేస్తున్నామని నాగార్జున వెల్లడించారు. నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్(ఎన్ఎస్ఐసి) పథకం ద్వారా 8వ తరగతి విద్యార్థులతో సమాజంలోని సమస్యల పరిష్కారాన్ని సూచించే ప్రయోగాలను చేయించడం జరుగుతోందన్నారు. కెన్నడీ-లూగర్ యూత్ ఎక్స్చేంజ్ (కేఎల్ వైఈస్) ప్రోగ్రాంలో భాగంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఒక ఏడాది పాటు ఉచితంగా అమెరికా లో విద్యాభ్యాసం చేసి తమ ప్రతిభను మెరుగుపర్చుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పథకంలో ఎంపిక కావడానికి విద్యార్థులకు అవసరమైన తర్ఫీదును ఇవ్వడం జరుగుతుందన్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ పథకం ద్వారా 3 విద్యార్థులు ఈ పథకానికి ఎంపిక కాగా, 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటి వరకూ 100 మంది విద్యార్థులు తొలిదశలో ఎంపిక కావడం జరిగిందని వివరించారు. టీసీఎస్ సహకారంతో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులలో సామర్థ్యాల పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను 50 గురుకులాల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు. దృష్టి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి అవసరమైన చికిత్సలు చేయడానికి నేత్ర పరీక్షలను చేయడం జరుగుతోందని ఇప్పటి వరకూ 71 గురుకులాల్లో ఈ పరీక్షల నిర్వహణను పూర్తి చేసామని నాగార్జున వెల్లడించారు. వైయస్సార్ కంటి వెలుగు, ఎన్పీసీబీ బృందాల ద్వారా మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. 





అనీమియాతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి అవసరమైన చికిత్సలను అందించడంలో భాగంగా ఇప్పటి వరకూ 185 గురుకులాలకు చెందిన 91,548 మంది విద్యార్థులకు పరీక్షలను పూర్తి చేసామని తెలిపారు.  వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై శిక్షణ ఇస్తున్నామని ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణను పూర్తి చేసామని వెల్లడించారు.

పోషకాహార లోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా గురుకులాల్లో చేపట్టడం జరిగిందని 

ఇప్పటి వరకూ 96,771 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు పూర్తి చేసామన్నారు. విద్యార్థులలో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన రుచికరమైన ప్రత్యేకమైన మెనూ ను గురుకులాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.

విద్యార్థులలో పంటి సమస్యలను గుర్తించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటి వరకూ 48 గురుకులాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబాయికి చెందిన  టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని ఇప్పటి వరకూ 7 జిల్లాలకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణను ఇచ్చామని, రాబోయే డిసెంబర్ 15 నాటికి మిగిలిన సిబ్ది అందరికీ ఈ శిక్షణను పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. అలాగే గురుకులాల్లోని తెలుగు,హిందీ టీచర్లకు ఇంగ్లీష్ బోలో యాప్ ద్వారా వంద రోజుల పాటు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించే శిక్షణను ఇస్తున్నామని నాగార్జున చెప్పారు. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం గురుకులాల్లో అమలు చేస్తున్న సీబీఎస్ఇ విద్యా విధానంపై 8వ తరగతికి చెందిన టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image