పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలనే మాటలను ముఖ్యమంత్రి అక్షరాల అమలు చేస్తున్నారు !!

 


 ఈదుమూడి, కట్లపల్లి ( పెడన ): 10 నవంబర్  (ప్రజా అమరావతి);



*పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలనే మాటలను ముఖ్యమంత్రి  అక్షరాల అమలు చేస్తున్నారు !!


*

                     

   *--- మంత్రి జోగి రమేష్*


 వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సేవలను పొందుతున్నారని తద్వారా  గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని మహాత్మా గాంధీజీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్షరాల అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విశ్లేషించారు.


   గురువారం ఉదయం ఆయన పెడన నియోజవర్గంలోని కొంకేపూడి,ఈదుమూడి, కట్లపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొని ఏకబిగిన మూడు గ్రామాల్లో 400 ఇళ్లను సందర్శించారు. 

       తొలుత ఆయన కొంకేపూడి గ్రామంలో చలపాటి ముసలయ్య, మోర్ల లక్ష్మి, ఉప్పలపాటి సోమయ్య, వీరంకి వనజక్షమ్మ, గరికిముక్కు నాగమణి, చుక్క జయరాజు, పల్లెకొండ కుమారమ్మ, జల్దుల వెంకటేశ్వరరావు, నందమూరి నాగమ్మ, తదితరుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆయా కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు కనుక్కొని వారు ప్రభుత్వపరంగా పొందుతున్న సంక్షేమ పథకాలను చదివి వినిపించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగిత నారాయణరావు, గంగమ్మ అనే వృద్ధ దంపతులు దంపతులు తమ కష్టాన్ని మంత్రికి చెప్పుకున్నారు. తమ పుత్రుడు మచిలీపట్నంలో ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడని ఇటీవల ఉద్యోగం పోవడంతో మొత్తం కుటుంబ సభ్యులమంతా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ డబ్బులతో తమ జీవనం కడుభారంగా కొనసాగుతుందని, తమ కుమారుడు మచిలీపట్నంలోనే  నివసిస్తున్నాడని చెప్పారు. వారి దుస్థితికి చలించిపోయిన మంత్రి జోగి రమేష్ తన వ్యక్తిగత కార్యదర్శి శివకు చెప్పి ఆ వృద్ధ దంపతులకు 5 వేల రూపాయల నగదు సహాయం అందజేశారు. అలాగే  పలువురు చెప్పిన వివిధ సమస్యలు ఓపిగ్గా విని అక్కడే ఉన్న అధికారులకు చెప్పి వాటిని తక్షణమే పరిష్కరించాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు.    

    

        అనంతరం కొంకేపూడి శివారు గ్రామాలైన ఈదుముడి కట్లపల్లి గ్రామాలకు కాలినడకన బయలుదేరారు. అంకేం వీర రాఘవమ్మ,, మోదుమూడి చిన్న వెంకటేశ్వరరావు, పామర్తి వరలక్ష్మి, పరస నాగకుమారి, మోదుమూడి బాలచంద్రన్ నరసింహమూర్తి, పామర్తి కొండేశ్వరరావు, బుర్ర వెంకటేశ్వరమ్మ, రాజులపాటి శ్రీనివాసరావు, కాగిత అనసూయమ్మ తదితరులు ఇళ్లకు వెళ్లి వారికి అందిన ప్రభుత్వ పథకాల గూర్చి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, గతంలో ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారిని అయినా కూడా అధికారులు రిటైర్ కావాలే తప్ప అర్హులకు పథకాలు అందేవి కావన్నారు. నేడు ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వారి ముంగిటకు చేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అధికారులే ప్రజల వద్దకు వెళ్లాలి అనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు


      గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న పెడన మార్కెట్ కమిటీ చైర్మన్  గరికిపాటి చారుమతి రామానాయుడు, ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, సర్పంచ్ దావు భైరవ లింగం, మండల పార్టీ అధ్యక్షుడు కొండవీటి నాగబాబు, కార్యదర్శి పామర్తి సాంబశివరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బెజవాడ నాగబాబు, పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య,గూడూరు జడ్పిటిసి వేముల సురేష్, వైస్ ఎంపీపీ పరస రాజేష్, నడపూరు సర్పంచ్ సింగంశెట్టి రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోయ ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు దావు శ్రీనివాసరావు, కోడూరు శ్రీనివాసరావు, యుగంధర్, శొంఠి  ప్రభుస్వామి, తమ్ము శ్రీనివాస్, పరస రాజేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image