అర్హులందరికీ సంక్షేమ పథకా లను పారదర్శ కంగా అందించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడు తోంది 🔹 *అర్హులందరికీ సంక్షేమ పథకా లను పారదర్శ కంగా అందించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడు తోంది *నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల ల రూపు రేఖలను ప్రభుత్వం మారు స్తోంది* 

. డిప్యూటీ సి ఎం* 


  *జిల్లాను అన్ని పథకాల అమలు లో ముందంజ లో ఉంచండి* 


 *డిసెంబర్ 21న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంకండి* 


*పేదలందరికీ ఇల్లు కార్యక్రమ పురోగతి పై శాసన సభ్యులు వారి నియోజక వర్గాల పరిధిలో సమీక్షలు నిర్వ హించి లక్ష్యాలను పూర్తి చేయండి* 


 :*గౌ. రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు* 


🔸 *సంక్షేమం, అభి వృద్ధి ఈ ప్రభుత్వా నికి రెండు కళ్ళు : జెడ్ పి చైర్మన్* 


🔹  *జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల సమ న్వయము తో ముందుకెళతాం* : 

 

    *జిల్లా జాయింట్ కలెక్టర్*  


చిత్తూరు, నవంబర్ 5 (ప్రజా అమరావతి): నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను ప్రభుత్వం మారుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొన్నారు.


శనివారం ఉదయం ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పి సర్వసభ్య సమావేశం చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరమైన డాక్టర్ వై ఎస్ ఆర్ సభా వేదిక నందు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన 5వ సర్వ సభ్య సమావేశం జరిగింది. 


ఈ సర్వ సభ్య సమావేశమునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు గౌ. రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గౌ. చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, గౌ.రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, గౌ.చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సత్యవేడు ఎంఎల్ఏ లు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ్, ఎం.ఎస్.బాబు ,ఆదిమూలం, గౌ.ఎంఎల్సి లు విఠపు బాలసుబ్రహ్మణ్యం, భరత్, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, ధనుంజయ రెడ్డి, రాష్ట్ర పాల ఏకిర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్ లతో పాటు జెడ్పి సీఈఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డిఆర్టిఎ, డ్వామా పీడీలు చంద్రశేఖర్, తులసి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, సమగ్ర శిక్ష ఎపిసి వెంకటరమణ రెడ్డి, ఉమ్మడిచిత్తూరు జిల్లాకు సంబంధించిన వివిధ సంబంధిత శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎం పి పి లు, కో జడ్పీపి కో ఆప్టేడ్ సభ్యులు,  పాల్గొన్నారు 


ఈ సమావేశానికి విచ్చేసిన *ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. పాఠశాలల విలీన ప్రక్రియ వలన మిగులుగా ఉన్న అదనపు తరగతి గదులను అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు వినియోగించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

 

*గౌ. రాష్ట్ర విద్యు త్,భూగర్భగనులు,అటవీ,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు మాట్లాడుతూ...* జిల్లాను అన్ని పథకాల అమలులో ముందంజ లో ఉంచాలని ఇందుకు అందరూ కలసికట్టుగా పని చేయాలని సూచించారు. డిసెంబర్ 21న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంకావాలని, జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో శాసన సభ్యులు సమీక్షలు నిర్వహించి పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నాడు – నేడు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని ఈ కార్యక్రమ పర్యవేక్షనా భాద్యత తల్లదండ్రుల కమిటీ, ప్రధానాపోద్యాయులు సమన్వయముతో పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా ప్రారంభించిందని, వైద్య సేవలను ప్రజలకు సత్వరమే అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని సూచించారు.   

  

*జడ్పీ చైర్మన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ..* గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారని, గడప గడప మన కార్యక్రమంను జిల్లాలో సమర్థ వంతంగా జరుగుతున్నదని, ప్రతి సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమంలో భాగంగా అందిన సమస్యల పరిష్కారం కొరకు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు కాబడ్డాయని తెలిపారు. జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.


*జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడు తూ...* జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళతామని, పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 21 నాటికి సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

 

*సత్యవేడు ఎం ఎల్ ఏ మాట్లాడు తూ...* రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలు చేసేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం జరిగిందని, నాడు – నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో అనేక మార్పులు చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


*ఎం ఎల్ సి విఠపుబాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ...* తన సర్వీసులో విద్యకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న నాడు – నేడు కార్యక్రమం అద్భుతం అని, గతంలో తానూ ఎం ఎల్ సి గా ఉన్న సమయంలో పాఠశాలల మరమ్మత్తుల నిమిత్తం కోరేవారని ప్రస్తుతం పూర్తిగా ఆ పరిస్థితి మారిందని, విద్యకు ఇంతటి ప్రాదాన్యతనిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నాడు – నేడు క్రింద ఎక్కువ సంఖ్యలో అదనపు తరగతి గదులు మంజూరైన పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులకు ఈ పనుల నిర్వహణలో ఇంజినీరింగ్ సిబ్బంది సహకారాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని, దీనితో పాటు పిల్లలకు రాగి జావ అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరగా ఈ అంశాలను పరిశీలిస్తామని మంత్రులు తెలిపారు. 


 *ఎం ఎల్ సి భరత్ మాట్లాడుతూ...* విద్యారంగంలో సంస్కరణలకు నాంది పలికిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని, చిత్తూరు జిల్లా నాడు – నేడు కార్యక్రమం అమలులో ప్రథమ స్థానంలో కలదని అలాగే అన్ని కార్యక్రమాలలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. కుప్పం లో టీచర్ ల కొరత కలదని, ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.  


సత్యవేడు మండల రాచపాలెంలో ఎయిడెడ్ పాఠశాల కలదని ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేయాలని కోరుతూ ఆరూరు ఉన్నత పాఠశాలలో తమిళ టీచర్ ను నియామకం చేయాలని గత సర్వ సభ్య సమావేశంలో కోరడం జరిగిందని దీని పై చర్య తీసుకుని తమిళ టీచర్ ను నియామకం చేసినందుకు సత్యవేడు జెడ్పిటిసి ధన్యవాదాలు తెలిపారు. కేవిబి పురం మోడల్ స్కూల్ కు 680 మంది విద్యార్థులు కలరని, అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కెవిబి పురం జెడ్పిటిసి, కుప్పం కు లా కాలేజి మంజూరు చేయాలని కుప్పం జెడ్పిటిసి, కురబల కోట మండలానికి పి హెచ్ సి మంజూరు చేసారని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మరియు ఎంపిపి వేతనం పెంపు, అలవెన్స్ పెంపు అంశాన్ని పరిశీలించాలని కురబలకోట ఎంపిపి, కార్వేటి నగరంలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించినందుకు జెడ్ పి టి ధన్యవాదాలు, కుప్పం లో హౌసింగ్ క్రింద మంజూరిన గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కుప్పం జెడ్పిటిసి, జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్ ను ఏర్పాటు చేయాలని పూతలపట్టు జెడ్పిటిసి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలన్నిటి పై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. ఎంపిపి లకు నెలకు రూ.8 వేలు చొప్పున అలోవేన్స్ మంజూరు చేయడం జరుగుతున్నదని, ఈ నిధులను మండలాలలోని సాధారణ నిధుల నుండి వినియోగించుకునేందుకు ఎంపిడిఓ లకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సి ఈ ఓ వివరణ ఇచ్చారు.    

సర్వ సభ్య సమావేశం లో వ్యవసాయ, భూ సంరక్షణ, విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, వైద్య మరియు ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రగతి పై సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలను సభకు వివరించారు. 


 *తీర్మానాలు* 


1.జిల్లా పరిషత్ నిధులతో పలమనేరు, కుప్పం, వి.కోట, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, హార్సిలీ హిల్స్ లో జెడ్ పి అతిథి గృహాల నిర్మాణం 


2.ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా 15 వ ఆర్ధిక సంఘం నిధులలో ఒక కోటి రూపాయలు కేటాయింపు 


3.జిల్లా పరిషత్ కార్యాలయం నిర్మించి 100 సంవత్సరాల పైబడినందున అవసరమైన భవనాల మరమ్మత్తులు, పునర్నిర్మాణం గావించుటకు ఆమోదం 


4.చిత్తూరు లో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించుటకు ఆమోదం 


5.జిల్లా పరిషత్ చైర్మన్ వాహనం కండిషన్ లో లేనందున నూతన వాహనం కొనుగోలుకు ఆమోదం.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image