విద్యా దీవెనతో ఉన్నత విద్య సాకారం కావాలి *విద్యా దీవెనతో ఉన్నత విద్య సాకారం కావాలి


*


పార్వతీపురం, నవంబర్ 30 (ప్రజా అమరావతి):  జగనన్న విద్యా దీవెనతో ఉన్నత విద్యను సాకారం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం జగనన్న విద్యా దీవెన 4వ విడత నిధులను  విడుదల కార్యక్రమం జరిగింది. వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు, విద్యార్థులకు నమూనా చెక్కులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పంపిణీ చేశారు. కళాశాలలో చదువుతున్న ప్రతి పేద విద్యార్థి చదువుకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి తల్లుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. తల్లి లేనప్పుడు సంరక్షకుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఆయన వివరించారు. విద్యా దీవెన విద్యార్థులకు గొప్ప వరమని ఆయన చెప్పారు. విద్యార్ధులకు మేన మామలాగా ముఖ్య మంత్రి అండగా ఉన్నారని,  అవకాశాలను అందిపుచ్చకోవాలని పిలుపునిచ్చారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 22,472 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో రూ.11,65,75,221 కోట్లు జమ అవుతుందన్నారు.  జిల్లాలో 13,938 మంది బి.సి విద్యార్థులకు రూ.7,68,14,344/-, 4887 మంది ఎస్. టి విద్యార్థులకు రూ.1,97,11,043/-, 2,727 మంది ఎస్.సి విద్యార్థులకు రూ. 1,36,00,190/-,  671 మంది ఈ.బి.సి. విద్యార్థులకు రూ.45,59,445/-, 209 మంది కాపు విద్యార్థులకు రూ.15,78,261/-, 30 మంది ముస్లిం విద్యార్థులకు రూ.2,43,167/-, 10 మంది క్రిస్టియన్ విద్యార్థులకు రూ.68,771 లను తల్లుల ఖాతాలో జమ చేస్తారని పేర్కొన్నారు.  పార్వతీపురం నియోజకవర్గంలో 6,229 మంది విద్యార్థులకు గాను రూ.3,51,16,858, సాలూరు నియోజకవర్గంలోని 4,330 మంది విద్యార్థులకు గాను రూ.2,28,43,609, కురుపాం నియోజకవర్గం లోని 5,916 మంది విద్యార్థులకు గాను రూ.2,99,31,813, పాలకొండ నియోజకవర్గం లోని 5997 మంది విద్యార్థులకు రూ. 2,86,82,939  రూపాయలను విద్యార్థుల తల్లులు ఖాతాలలో  జమ అవుతుందని వివరించారు.


ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments