కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు



 *- కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు*


 

 *- ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తున్నాం* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


అమరావతి, నవంబర్ 19 (ప్రజా అమరావతి): కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు సమక్షంలో కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.100కోట్ల సాయాన్ని అందించడం జరిగిందన్నారు. కార్యకర్తలంటేనే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలని చెప్పారు. కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా ఉంటుందని చంద్రబాబు, నారా లోకేష్ లు అభిప్రాయపడ్డారన్నారు. కార్యకర్తల ఆరోగ్యం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు రూ. 2లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల కల్పనలోనూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో న్యూట్రిఫుల్ యాప్ ను రూపొందించారన్నారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, జీవన విధానాలపై అవసరమైన సూచనలను కూడా అందిస్తున్నామన్నారు. థైరాయిడ్, బరువు సమస్యలను నయం చేయసుకోవచ్చన్నారు. ఈ యాప్ ను కార్యకర్తలందరూ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ స్టాల్స్ లో కార్యకర్తలు తమ బయోడేటా, ఫోన్ నెంబర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యకర్తల సంక్షేమంలో ఇతర పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోవడం జరిగిందన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే మరణించిన కార్యకర్త కుటుంబానికి చంద్రబాబు రూ. 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. దీన్నిబట్టి కార్యకర్తల సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేయడం. జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే కార్యకర్తలకు ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమంపై ఏవైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్లో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని శిష్ట్లా లోహిత్ కార్యకర్తలకు సూచించారు.

Comments