కలెక్టర్ ను కలిసిన రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ సి.హెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి...
ఏలూరు, నవంబరు, 14 (ప్రజా అమరావతి).. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజులు పర్యటనలో భాగంగా సోమవారం ఏలూరు చేరుకున్న రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ సి.హెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో తన పర్యటనా వివరాలను విజయ్ ప్రతాప్ రెడ్డి వివరించారు. జిల్లాకు వచ్చే మార్గ మద్యలో పలు విద్యాసంస్ధలు, అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించి మంగళవారం, బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. సందర్శన అనంతరం ఈ నెల 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వీరి వెంట కమీషన్ సభ్యులు కిరణ్, డిఎస్.ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు కె. మంజూభార్గవి తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment