ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు


                                                                

                                                                       

    విజయవాడ (ప్రజా అమరావతి);                                



ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావును  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ కేబినేట్ హోదాను ప్రకటించింది. 


ఈ సంధర్బంగా  నవంబర్, 10 వ తేది, ఉదయం 11 గంటలకు, ప్రెస్ అకాడమీ కార్యాలయం, విజయవాడలో ఆయన ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సమాచార పౌరసంబంధాల, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తో పాటు కొందరు మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్  ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

Comments