స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి- జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి-


 జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్



పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), నవంబర్ 21 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు.


సోమవారం ఉదయం పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఇంచార్జి డిఆర్ఓ భాగ్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 103 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్దేశించిన గడువులోగా అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం పరిష్కారం చూపాలని   పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలులో భాగంగా హౌస్ హోల్డ్ సర్వే చేపడుతుండగా, జిల్లాలో మొత్తం 15,823 హౌస్ హోల్డ్ ఉండగా, 2,765 హౌస్ హోల్డ్ సర్వే చేశారని, సర్వేని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు మానిటర్ చేయాలని, రోజూ సమీక్ష నిర్వహించాలని, వెనుకబడిన చోట ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా సర్వేని చేయాలని, వెంటనే పురోగతి సాధించి సకాలంలో పూర్తి చేయాలన్నారు.

స్పందనలో వచ్చిన అర్జీలు పరిష్కారంతోపాటు రీ ఓపెన్ ఆయన కేసులు పై కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు  రీ ఓపెన్  అయిన వాటిపై సంబంధిత అధికారిలు  క్షేత్రస్థాయిలోకి వెళ్లి  సమన్వయంతో  పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను గ్రామదర్శిని లో గుర్తించి సమస్యలను బే రీజులు వేసుకుని వాటిని నిధులు కేటాయించి పరిష్కారమయ్యేలా చూడాలని తెలిపారు ప్రభుత్వంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో భాగంగా మంజూరైన పనులు వెంటనే గ్రౌండ్ చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంజూరుకాని పనులు మంజూరు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, తదితర ప్రాధాన్యత పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ లో సామూహిక గృహ ప్రవేశాలలో భాగంగా జిల్లాకు 11,500 ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా, చాలామంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ఇళ్ల నిర్మాణంలో వెనకబడి ఉన్నారని, ఎంపిడిఓలు నిత్యం సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. డిసెంబర్ 21నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ఇళ్ల పూర్తిలో వేగం పెంచాలన్నారు. ఇళ్ల నిర్మాణాలపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్ట్, కంటెంప్ట్ కేసుల్లో సమీక్ష నిర్వహించుకుని సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు.


 ఈరోజు నిర్వహించిన ప్రజా స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలతో కూడిన అర్జీలను సమర్పించారు. ఇందులో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.


 పెనుగొండ కుమ్మర వీధికి చెందిన  ఒంటరి మహిళ రామాంజనమ్మ పెన్షన్ కోసం గతంలో అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని పేర్కొంటూ  అర్జీని సమర్పించింది.


 రోళ్ల మండలం  కాలువే పల్లి గ్రామానికి  చెందిన భీమప్ప  ఇల్లు కూలిపోయిందని దీని స్థానంలో   కొత్త ఇంటి నిర్మాణానికి వెళ్ళినప్పుడు  ఆ స్థలాన్ని మరొకరు ఆక్రమించుకున్నారని తనకు న్యాయం చేయవలసిందిగా వినతిని సమర్పించారు.


  ఆమడగూరు చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ తన పొలం సర్వే నంబర్ 460/ఎ2 లో  రాస్తా కొరకు  తగు చర్య నిమిత్తం అనుమతి మంజూరు చేయవలసిందిగా వినతిని సమర్పించారు.

 నల్లమడ మండలం తోలేటి పల్లి కి చెందిన రత్నమ్మ ఇంటికి చాలాకాలంగా  అధికారులు విద్యుత్ సర్వీసులు కల్పించలేదని తన పేరు మీద ఉన్న ఆధార్ లింకుపై మరొకరికి విద్యుత్ సర్వీసులు అందుతున్నాయని సమస్యను పరిష్కరించాలని బాధితురాలు అర్జీ ని సమర్పించింది.


ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్, పంచాయతీ రాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, డిఈఓ మీనాక్షి, డ్వామా పిడి రామాంజనేయులు, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments