విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ శాఖకు చెందిన ప్రతి ఒక్క సిబ్బందిని అభినందించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.


 విశాఖపట్నం సిటీ (ప్రజా అమరావతి);


*విశాఖపట్నం నగర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.ఎస్.* 


*సిబ్బందికి  అభినందనలు*


విశాఖపట్నంలో ఇటీవల రెండురోజుల పాటు జరిగిన ప్రధానమంత్రి పర్యటనలో ఎక్కడ ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ శాఖకు చెందిన  ప్రతి ఒక్క సిబ్బందిని అభినందించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.*విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాల పైన రివ్యూ*


కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ చాలా స్థిరముగా ఉందని, అటెమ్ట్ టో మర్డర్స్, రేప్ లు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు, మర్దర్లు స్తంభతగా నిలకడగానే ఉంది. ప్రాపర్టీ ఆఫన్సెస్ నేరాల శాతం  తగ్గించాల్సిన అవసరం ఉంది అందుకు రానున్న రెండు నెలలలో ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు వెళ్తామన్నారు.


*లోక్ అదాలత్ తో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం:*


మొన్న  జరిగిన లోక్ అదాలత్ తో  రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యంత శ్రమించి సుడిర్గకాలంగా చిన్నపాటి వివాదాలు, మనస్పార్ధాల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో  ఇరువర్గాలను పిలిపించి వారికి కేసు తీవ్రత, జర జరగబోయే పరిణామాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన ఇరు వర్గాలకు అర్థమయ్యే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి  లోక్ అదాలత్ లో  రాజీ పడేందుకు ఎంతగానో కృషి చేశారు. దాని ద్వారా 47  వేల ipc మరియు పెండింగ్ ట్రైల్ కేసులు డిస్పోజల్ జరిగినాయి. ఎఫ్ఐఆర్ కేసులతోపాటు వేల సంఖ్యలో పెట్టి కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. ఈ  సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరినీ అభినందిస్తున్నాను. పోలీసులు న్యాయవ్యవస్థతో సమన్వయ పరుచుకోవడం ద్వారా ఈ సాధ్యమైంది. రాబోయే రోజుల్లో సైతం నిర్వహించే  లోక్ అదాలత్ లో ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంభిచడం ద్వారా మరిన్ని  పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. 


*మొత్తం పోలీసింగ్ వ్యవస్థ కు కన్విక్షన్ బేస్ గా మార్చేందుకు కృషి* 


పూర్తి పోలీస్ వ్యవస్థ కన్వెన్షన్ ఆధారంగా నడిచే విధంగా విధానాన్ని మార్చాము. నూతన విధానాన్ని అమలు చేస్తున్నాము. అందులో భాగంగా ఎస్పీలకు సైతం అత్యంత ముఖ్యమైన నాలుగు నుండి ఐదు కేసులను వారి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగే విధంగా చర్యలు తీసుకున్నాము దీని ద్వారా కేసులలో నేరస్తులకు శిక్షల శాతం గణనీయంగా పెరుగుతుంది. విశాఖపట్నం నగర పరిధిలో సంవత్సర కాల వ్యవధిలోనే కేవలం ఒక్క  POSCOకు సంభందించిన 10 కేసుల్లో  నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు కన్విక్షన్  పడేవిధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి ఫలితాలు తీసుకురావడంలో కృషిచేసిన దిశా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు అధికారులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాము.


*గంజాయి నిర్మూలన పైన కొనసాగుతున్న చర్యలు* 


ఈ సంవత్సరం గంజాయి కి సంబంధించి గట్టిగా కృషి చేయడం ద్వారా ఇప్పటివరకు 1599   కేసులు నమోదు చేసి 1,32,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులలో  దేశంలోని  12 రాష్ట్రాలకు చెందిన నిందితులను గుర్తించాము.ఆ రాష్ట్రాల సహకారంతో అరెస్టు త్వరలోనే అరెస్టు చేస్తాము. అంతే కాకుండా  త్వరలోనే తిరుపతిలో బార్డర్ గంజాయి, ఎర్రచందనం పైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము.


ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కొంతమేర మావోయిస్టుల యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం AOB  సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం కుబింగ్  అనేది కొనసాగుతూనే ఉంటుంది వారిని ఏరకంగా అని చేయాలన్న దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉంటుంది అది నిరంతర ప్రక్రియ.


*సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక SOP(స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్), అవగాహన కార్యక్రమాలు*


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో  సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సైబర్ క్రైమ్  ఫిర్యాదు వచ్చినప్పుడు ఏరకంగా కేసు నమోదు చేయాలి.. దానిని దర్యాప్తు ఏరకంగా నిర్వహించాలన్న దానిపైన ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. వీరంతా కూడా అనంతపురం  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో  శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఒక ముందస్తు ప్రణాళికతో స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టంతో మేము ముందుకు కొనసాగుతున్నాము . లోన్ యాప్, పలు సైబర్ క్రైమ్స్ ను వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా, పోస్టర్ల ద్వారా అవగాహన పెంపోందించాలని, రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గేలా బ్లాక్ స్పాట్స్  గుర్తించి, ఆ ప్రాంతాల్లో సిబ్బందిని తగిన సమయాలలో సధ్వినియోగించాలని  తెలిపారు


త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 6500  మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం  అనుమతులు మంజూరు చేసింది త్వరలోనే ఆ నియమాకాలు చేపడతాము.

ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ,ఐపిఎస్., నగర డి.సి.పి శ్రీ సుమిత్ సునీల్ గరుడ్,ఐపిఎస్., నగర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే రైతులకు సర్టిఫికేషన్
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image