పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయం

 పేదలకు మెరుగైన వైద్యాన్ని   అందించడమే ప్రభుత్వ  ధ్యేయం


జిల్లా కలెక్టర్ 

బసంత్ కుమార్పుట్టపర్తి నవంబర్ 21 (ప్రజా అమరావతి): ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే   ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్   బసంత కుమార్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్  ఆదేశాల మేరకు "  ఫ్యామిలీ డాక్టర్ విధానం"  నేటికి ఒక మాసం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా అత్యంత ప్రతిభ కనబరచిన వైద్యులను అభినందిస్తూ వారిని  జిల్లా కలెక్టర్ ఆత్మీయ సత్కారం చేశారు.  

ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ నందు జిల్లా స్థాయిలో ఉత్తమ 

సేవలదించిన ఐదుగురు వైద్యాధికారులను రాష్ట్ర స్థాయిలో ఎన్నిక చేయడం జరిగింది. అందులో శ్రీ సత్యసాయి జిల్లాలో *తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం* లో పనిచేయు డాక్టర్ మున్వర్ బాషా గారు మరియు డాక్టర్ VT రోజా గారు, ఎన్నిక కావడం అభినందనకరం.

జిల్లా స్థాయిలో ఐదుగురు వైద్యాధికారులు ఎన్నిక అయితే  అందులో తలుపుల PHC కి చెందిన వారే ఇద్దరు కావడం అభినందనకరం అని జిల్లా కలెక్టర్ గారు అభినందించారు.

  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా పేద ప్రజలు రవాణా ఖర్చులు లేకుండా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్యం అందుకోగలుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి ముంగిటకు వైద్యం రావడంతో నిరుపేద రోగుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా మన రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం సేవలందించిన వైద్యుల స్ఫూర్తితో  ఇతర వైద్యులు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగించి సత్ఫలితాలు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ , ఇన్చార్జ్ డిఆర్ఓ భాగ్యరేఖ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఎస్ వి కృష్ణారెడ్డి,   డిసిహెచ్ఎస్ డా. తిప్పేంద్ర  నాయక్, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్, కదిరి తాలూకా ఎన్జీవో అధ్యక్షులు వేణుగోపాల్ , వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments