చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా,కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లచే ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మ

 చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా,కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లచే ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మఅమరావతి,16 నవంబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమీషనర్ గా ఆర్.మహబూబ్ భాషా,కమీషనర్ గా పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే సిఎస్ డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జిపిఎం&ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ స్వాగతం పలుకగా అనంతరం ఇరువురు కమీషనర్లచే సిఎస్ ప్రమాణం చేయించారు.అనంతరం ఇరువురు కమీషనర్లకు సిఎస్ డా.సమీర్ శర్మ,స్పెషల్ సిఎస్ ప్రవీణ కుమార్ లు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషనర్లు రేపాల శ్రీనివాసరావు,బివి రమణ కుమార్,కట్టా జనార్ధనరావు,ఐలాపురం రాజా పాల్గొన్నారు.అలాగే చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ప్రమాణం చేసిన ఆర్.యం.భాషా కుటుంబ సభ్యులు మరియు కమీషనర్ గా ప్రమాణం చేసిన శామ్యూల్ జొనాతన్ కుటుంబ సభ్యులు,రాష్ట్ర సమాచార కమీషన్ కార్యదర్శి డా.వి.సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య,సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.   

    

Comments