నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, రబీ సీజన్లో ధాన్యం సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలి

 రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, రబీ సీజన్లో ధాన్యం సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాల


ని హోం మంత్రి డా. తానేటి వనిత స్పష్టం చేశారు.


మంగళవారం వివిధ అంశాలపై సమగ్రంగా జిల్లా కలెక్టర్ మాధవీలత తో కలిసి హోం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ , ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద పలు వైద్య సేవలు అందించడం ద్వారా మెరుగైన వైద్య విధానం అమలు చేయడం జరుగుతోందన్నారు.  కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కేసులను ఎందుకు రాజమండ్రికి రిఫర్ చేస్తున్నారని, వీటిపై  పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో జగన్న కాలనీల్లో ఇళ్లు త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు.  అందుకు సంబందించి అన్ని శాఖల అధికారు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చేపట్టడం లో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కు అదనంగా రూ.35 వేలు బ్యాంకు రుణం మంజూరు చేయడం చేస్తున్నట్లు తెలిపారు.  ఇంటి నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ జగనన్న కాలనీల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణం చేసిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల పురోగతి పై సమీక్ష చేశారు.  రబీ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింతగా తీసుకుని వెళ్ళాలని మంత్రి స్పష్టం చేశారు.  గన్ని బ్యాగులు, రవాణా వ్యవస్థ, హమాలీ లకు సంబంధించి ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో ప్రణాళిక సిద్ధం చేసి ఆచరణ లో చూపాలని, అందుకు అధికారులు సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ఇప్పటికే మండల పరిధిలో రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లా కు ఆదర్శంగా కొవ్వూరు నియోజక వర్గం నిలిపే దిశలో ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలియ చేశారు.



కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత అన్నారు. వైద్య సేవలు కొరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణ సేవలు అందించకుండా  వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే వారి సమాచారం  అందించాలని మంత్రి ఆదేశించడం జరిగిందని,  వారిపై  చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి జనరేటర్ ఉందని కరెంటు పోయిన విద్యుత్ ఆటంకం లేదని ఆయన తెలిపారు.


జాయింట్ కలెక్టరు సిహెచ్ . శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతు దళారుల నుంచి ఎటువంటి దోపీడీకి గురికాకుండా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి రైతును అన్నివిధాల ఆదుకోవాలనే సంకల్పంతో ఈ ఏడాది నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. 75 కేజీల బస్తాకు రూ.1530/-లు అందిస్తున్నామన్నారు. హామాలీ, ట్రాన్స్ పోర్టు ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ఏడాది ప్రతి ఆర్బీకే నందు రైతు షడ్యూలు  చేయించుకుకొని నాణ్యాత ప్రమాణాలకు సాంకేతిక నిఫుణుడు నిర్థాన సర్టిపికేట్ ఇచ్చిన తదుపరి రైతు ధాన్యం దగ్గరలో ఉన్న ఏదో ఒక మిల్లుకు వెళుతుంన్నారు.   దీని వలన మిల్లుర్లు ఆ రైతును మోసగించడానికి తావుండన్నారు. ధాన్యం షెడ్యూలు అయిన 21 రోజుల్లో రైతు ఖాతాలో ధాన్యం సొమ్ము జమ అవుతుందన్నారు.   గన్నిబ్యాగ్స్ 30 లక్షలు మన జిల్లాలో ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. జిల్లాలో హామాలీలను 1324 మందిని గుర్తించామన్నారు. ట్రాన్స్పోర్టు కూడా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలో జమ చేసేవిధంగా మార్పులు చేశామన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 3 కోట్ల వరకు రైతులకు చెల్లించామన్నారు.  ఆర్బీకే పరిదిలో ఉన్న స్థలం మొత్తం ఈ క్రాప్ నమోదు చేసామన్నారు.


 


ఈ సమావేశంలో మునిసిపల్ ఛైర్పర్సన్, బావన రత్న కుమారి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్, పోసిన శ్రీలేఖ, మునిసి పల్ వైస్ ఛైర్ పర్సన్, గండ్రోతు అంజలీ దేవీ,కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డీఈవో ఎస్. అబ్రహ్మం, డీసీహెచ్ఓ  డా. ఎమ్. సనత్ కుమార్, డీపీఓ పి. జగదాంబ, జిల్లా రవాణా ధికారి,కె.ఎస్.ఎం.వి.కృష్ణారావు, ఆర్ అండ్ బీ ఈఈ దేవేంద్రరావు, పంచాయితీరాజ్ ఎస్ ఈ ఎబివీ ప్రసాద్,విద్యుత్ శాఖ ఈఈ బి.వీరభద్రరావు, పీడీ హౌసింగ్ బి. తారాచంద్, జియం పరిశ్రమలుశాఖ బి. వెంకటేశ్వరరావు,  జెడి మత్య్సశాఖ వి.కృష్ణారావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితారులు పాల్గొన్నారు.

Comments