టొమాటో రైతుల మద్దతుకు త్రైపాక్షిక ఒప్పందం

 *టొమాటో రైతుల మద్దతుకు త్రైపాక్షిక ఒప్పందం


*

*•ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డవలెప్మెంట్ కు శ్రీకారం*

*•దాదాపు 20 వేల మంది రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ.లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డవలెప్మెంట్* 

*•దళారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధరతో టొమాటో  రైతుల ఆధాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ చర్యలు*

*•రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు* 

*•ఇప్పటికే ఏర్పాటైన 4 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను వచ్చే నెల్లో ప్రారంభానికి చర్యలు*

                                                                 * * *

అమరావతి, నవంబరు 21 (ప్రజా అమరావతి): దళారుల ప్రమేయం లేకుండా  టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆధాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డవలెప్మెంట్ కు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబందించి ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ మరియు లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి నేతృత్వంలో సోమవారం అమరావతి సచివాలయంలో కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 20 వేల మంది టొమాటో రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ. (Farmer Producer Organizations) లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డవలెప్మెంట్ జరుగనుంది. 

                                                                                                                                                                                                  ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు.  ఈ నేపథ్యంలో టొమాటో రైతుల సంక్షేమానికై  జగనన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయడం జరిగిందన్నారు.  మార్కెట్, దళారుల ప్రమేయం లేకుండా  టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారికి ఆధాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డవలెప్మెంట్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దాదాపు 20 వేల మంది రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ.లతో ఈ ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డవలెప్మెంట్ చేయడం జరుగుతుందన్నారు. 

                                                                                                                                                                                            కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్ క్రింద టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప ఉత్పత్తులకు సంబందించి ఫుట్ ప్రాసెసింగ్ యూనిట్ల  ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించండం జరుగుచున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జగనన్న ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అనుబంధంగా  ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని  ఏర్పాటు చేసిందన్నారు. సాధారణంగా డిమాండు, సప్లైకి అనుగుణంగా టొమాటో ధరలో హెచ్చుతగ్గులు ఉందడం వల్ల కొన్ని సార్లు వినియోగదారులపై భారంపడం మరికొన్ని సార్లు రైతులు నష్టాలకు గురికావడం జరుగుతుందన్నారు.  టొమాటో  ధరలు అదికంగా ఉన్నప్పుడు వినియోగదారులకు ఉపశమాన్ని కల్పించేందుకై ప్రభుత్వమే వాటిని కొనుగోలుచేసి  రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడటం వల్ల, డిమాండుకు మించి  విపరీతమైన దిగుబడి రావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇటు వంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డవలెప్మెంట్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకై ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ మరియు లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ తో నేడు త్రైపాక్షిక ఒప్పందం  కుదుర్చుకోవడం జరిగింది. 

                                                                                                                                                                                ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆద్వర్యంలో ప్రభుత్వం ఇప్పటికే  రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.  వీటిలో 4 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తయినాయని, వచ్చే నెల్లో వాటిని ప్రారంభించడానికి చర్యలను తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతను ఎఫ్.పి.ఓ. లకు అప్పగించడం జరుగుతుందని, క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర ప్రాసెసింగ్  ప్రక్రియకు సంబందించిన కెపాసిటీ బిల్డింగ్ పనులకు  ఏపీ  మహిళా అభివృద్ది సొసైటీ సహకరిస్తుందని మరియు మార్కెటింగ్ చైన్ అభివృద్దికి  లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సహకరిస్తుందన్నారు. అందరి భాగస్వామ్యంతో టొమాటో రైతులను అన్ని విధాలుగా ఆదుకొనేందుకు మరియు  కనీస మద్దతు ధరను కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించి పూర్తి స్థాయిలో  టొమాటో రైతులకు లబ్దిచేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న  ప్రభుత్వం ఈ చర్యలను తీసుకోవడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.  ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌధరి, ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఇ.ఓ. ఎల్.శ్రీధర్ రెడ్డి ఎంతగానో కృషిచేశారంటూ మంత్రి వారిని  అభినందించారు. 

                                                                                                                                                                                           రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌధరి, ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఇ.ఓ. ఎల్.శ్రీధర్ రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ సి.ఇ.ఓ.  సి.ఎస్.రెడ్డి, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సి.ఇ.ఓ. పి.విజయరాఘవన్ తదితరులతో పాటు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                                        

Comments