చట్ట వ్యతిరేకమైన పనులు మరియు అసాంఘిక కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు-కొల్లిపర ఎస్సై.

 కొల్లిపర (ప్రజా అమరావతి);      కొల్లిపర లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మూత్రం  నిమిత్తము కొల్లిపర లోని కరెంట్ ఆఫీస్ రోడ్లోకి వెళ్ళగా  అక్కడ చెడు వ్యసనాలకు  బానిసైనా  నలుగురు వ్యక్తులు ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి చంపుతానని బెదిరించి వారి వద్ద నుండి 1700/-  రూపాయలను నగదును దొంగతనం చేయగా వారిలో ఒక విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ నలుగురు ముద్దాయిలలో 

 1) *తూమాటి శ్యాం కుమార్ @ సన్నీ* 

2) *మండ్రు రాజ్ కుమార్@ పెద్ద సన్నీ* 

3) *అమిరే ఆనంద్ కిషోర్*@ *చోటు*  

కొల్లిపర గ్రామానికి చెందిన

ముగ్గురుని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం అయినది. 

చట్ట వ్యతిరేకమైన పనులు మరియు అసాంఘిక కార్యకలాపాలలో  పాల్పడిన వారిపై కఠిన చర్యలు


తీసుకోబడునని కొల్లిపర ఎస్సై ఆర్.రవీంద్రారెడ్డి తెలియజేశారు.

Comments