మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే రైతులకు సర్టిఫికేషన్

 కొల్లిపర  (ప్రజా అమరావతి); డాక్టర్ వైయస్సార్ పొలంబడి మేలైన యాజమాన్య పద్ధతులు జిఏపి అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమం పై రైతులకు శిక్షణ కార్యక్రమం,  ఆహార మరియు వ్యవసాయ సమస్త ఎఫ్ఏఓ కలిసి నిర్వహించబడుతుందని, ఈ సంవత్సరం పై కార్యక్రమం సంబంధించి జిల్లాస్థాయిలో వరి పంటకి మున్నంగి -2 ఆర్బికేని ఎంపిక చేయటం జరిగిందని, ఏ



డీఏ, కే. వెంకట్రావు తెలిపారు. మున్నంగి ఆర్ బి కే లో జరిగిన ఈ సమావేశంలో 250 ఎకరములు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి పొలంబడి ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే ఆ రైతులకు సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుందని తద్వారా రైతులు పండించిన పంటను INDIGAP అను పేరుతో నాణ్యమైన ఉత్పత్తులుగా అధిక ధరకు విక్రయించి లాభాలు పొందవచ్చునని, మేలైన యాజమాన్య పద్ధతులు చేసి  చేసినవారికి సర్టిఫికేషన్ ఇవ్వబడుతుందని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్  ఎం. రత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో డి డి ఏ, డి ఆర్ సి, పి. రామాంజనేయులు,   డి. యుగంధర్, క్వాలిటీ మేనేజర్ ఎస్ ఎస్ సి ఎ, గ్రామ సర్పంచ్ వేమూరి దీనమ్మ, అభ్యుదయ రైతులు ఆరిగా. కోటిరెడ్డి, కల్లం వెంకట అప్పారెడ్డి, మండల అగ్రి అడ్వైజరీ బోర్డు మెంబర్ వంగా. శ్రీనివాస్ రెడ్డి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments