జిల్లా పరిషత్ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా, ఫలప్రదంగా జరిగేందుకు అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి



నెల్లూరు, నవంబర్ 2 (ప్రజా అమరావతి):  జిల్లా పరిషత్ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా, ఫలప్రదంగా జరిగేందుకు  అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాల


ని, సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కారించి సభపై నమ్మకం, విశ్వాసం కలిగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. 


    బుధవారం ఉదయం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో  చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా, జడ్పీ సీఈవో శ్రీ చిరంజీవి సభను కొనసాగించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసి, ఎంపీపీ సభ్యులు సూచించిన పలు సమస్యలపై  జెడ్పి చైర్పర్సన్ శ్రీ అరుణమ్మ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు చర్చించారు. 

 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విప్లవత్మకంగా సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నాడు నేడు పథకంతో పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నెల్లూరు పెన్నా, సంగం శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీలను ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రికి సభ తరపున ధన్యవాదాలు తెలిపారు. సభలో సభ్యులు అనేక రకాల సమస్యలను ప్రస్తావించారని, ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు.  రాష్ట్రంలో అభివృద్ధి పనులు అనేకం జరుగుతున్నాయని, కొంతమంది కావాలని దృష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి వాటిని తిప్పికొట్టేందుకు ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తామంతా పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 


తొలుత జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ  దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. 


 అనంతరం శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా ఆర్ అండ్ బి, వ్యవసాయ, జలవనరులు, విద్యుత్, స్త్రీ,శిశు సంక్షేమ,పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్య, గృహ నిర్మాణ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు సభకు వివరించారు. 

 సభలో ప్రధానంగా ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన నగదు, చెరువుల మరమ్మత్తులు, పూడికతీత, చెరువుల్లో అక్రమంగా మట్టి తరలింపు, రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు, జల్ జీవన్ మిషన్, పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనులు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తదితర అంశాలపై చర్చించారు. 

 

పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, స్నాక్స్ పంపిణీ: జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణమ్మ

............................... 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, సాయంత్రం పూట స్నాక్స్ జిల్లా పరిషత్ నుంచి అందజేస్తామని చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ వెల్లడించారు. సభలో ఎమ్మెల్సీ శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం ఈ విషయమై ప్రస్తావించగా, ఆమె సానుకూలంగా స్పందించడం పట్ల సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. 


నాడు నేడు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

- ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

............................... 

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, ముఖ్యంగా నాడు నేడు పథకంతో పాఠశాలలన్నీ సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయని ఎమ్మెల్సీ శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. నాడు నేడు మొదట విడత పనులు చాలా చురుగ్గా జరిగాయని, రెండో విడతలో పనుల భారం మొత్తం ప్రధానోపాధ్యాయులపై పడుతుందని, ఈ పనులు సక్రమంగా జరిగేందుకు మరి కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బందిని కేటాయించాలని ఆయన కోరారు. అలాగే సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని ఆయన కోరారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు,నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను హైస్కూల్లో విలీనం చేయడం వల్ల, పాఠశాలలో కొన్ని గదులు ఖాళీ అయ్యాయని, ఆ గదులను అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బులను కూడా త్వరగా చెల్లించాలని సూచించారు. 


 ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం,  ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,  ఆప్కాబ్ చైర్మన్ శ్రీ అనిల్ బాబు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ వీరి చలపతి, విజయా డెయిరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి,  పంచాయతీ రాజ్, ఆర్డబ్లుఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ రంగ వరప్రసాద్,  శ్రీ కృష్ణ మోహన్, డిఎంహెచ్ఓ శ్రీ పెంచలయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ సుధాకర్ రాజు, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీ సుబ్బారెడ్డి, మత్స్యశాఖ జెడి శ్రీ నాగేశ్వర రావు, డిఆర్డిఎ, డ్వామా, మెప్మా,ఎపిఎంఐపి పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకట్రావు, శ్రీ రవీంద్ర, శ్రీ శ్రీనివాసులు, డిఈఓ శ్రీ రమేష్ , సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, డిటిసి శ్రీ చందర్, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం శ్రీ ప్రసాద్,జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కనకదుర్గాభవాని, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య,  పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు తదితర జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments