ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులు మార్కప్ బ్రాండ్ తో అవిష్కరణ.

 *ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులు  మార్కప్ బ్రాండ్ తో అవిష్కరణ*


*•5 రకాల ప్రకృతి సిద్ద ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి*

*•ప్రకృతి సిద్దం పండించే వ్యవసాయ ఉత్పత్తులకు 10% అదనంగా గిట్టుబాటు ధర*

                                                                             * * *

అమరావతి, 3 నవంబరు (ప్రజా అమరావతి): ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన నాణ్యమైన, ఆరోగ్య కరమైన సహసిద్ద వ్యవసాయ ఉత్పతులను  వినియోగ దారులకు  తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు మార్కప్ బ్రాండ్ తో ఏ.పి. మార్కుఫెడ్ రూపొందించిన  ఐదు రకాల ఉత్పత్తులను రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో లాంచనంగా ప్రారంభించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులపై పనిచేసే రైతు సాధికారత సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు  వినియోగ  దారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన సహసిద్ద వ్యవసాయ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మార్కప్ బ్రాండ్ తో ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్ లోకి  ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. తొలుత బెల్లం, వేరుశనగ పప్పు, జొన్నపిండి, రాగి పిండి, శెనగపప్పు తదితర ఐదు ప్రకృతి సిద్ద ఉత్పత్తులను ఈ బ్రాండ్ పేరుతో  నేడు బహిరంగ మార్కెట్ లోకి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.  దశల వారీ మిగిలిన అన్నిప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో వినియోగ దారులకు అందుబాటులోకి తీసురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 

                                                                                                                                                                                    రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే లక్ష్యం, చిత్తశుద్దితో కృషిచేస్తున్నారన్నారు. రైతులు పండించే పప్పుదినులు, చిరుధాన్యాల రేట్లు బహిరంగ మార్కెలో ఏమాత్రం పడిపోయినా సరే కేంద్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వారి ఆదేశాల మేరకు  ఏపి మార్కుఫెడ్ సేకరించిన  ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో బహిరంగ మార్కెట్ లోకి తీసుకు వచ్చి  రైతులను అన్ని విదాలుగా ఆదుకోవాలనే  లక్ష్యంతోనే ఈ   వినూత్న విధానానికి శ్రీకారం చుట్టం జరిగిందన్నారు. ప్రకృతి సిద్దంగా పండించే వ్యవసాయ ఉత్పత్తులకు 10% అదనంగా గిట్టుబాటు ధర లభించే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

మార్కుఫెడ్ ద్వారా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రయోగాత్మకంగా ప్రసాదాల కోసం వినియోగించడం జరుగుచున్నదన్నారు. రసాయనరహితమైన ఆరోగ్య కరమైన పరిశుభ్రమైన భోజనాలు అందించాలనే లక్ష్యంతో ఒక వింగ్ ఏర్పడిందని, రైతు సాధికార సంస్థ ద్వారా రైతుల వివరాలు, వారి ఉత్పత్తుల వివరాలను సేకరించి రాష్ట్రంలోని మిగిలిన దేవాలయాలకు అన్నింటికీ కూడా  ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పిల్లలు, గర్బవతులు, బాలింతలకు కూడా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ఆయా సంస్థలకు కూడా ఈ ఉత్పత్తులను అందజేయడం జరుగుచున్నదన్నారు. 

                                                                                                                                                                                                            ఏ.పి. మార్కుఫెడ్ చైర్మన్  పి.పి.నాగి రెడ్డి, ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డి, మేనేజింగ్  డైరెక్టర్ డా.శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ బి.ఆదినారాయణ,  మార్కప్ బ్రాండ్ హెడ్ ఎ.శ్రీధర్ తదితరులు ఈ ఉత్పత్తుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                                      

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image