ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, రైతు ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ప్రభుత్వం తమది

 

నెల్లూరు  నవంబర్ 24 (ప్రజా అమరావతి);


ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, రైతు ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ప్రభుత్వం తమద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.  


గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం రామదాసు కండ్రిక పరిసర గ్రామాల్లోని 5 వేల ఎకరాలకు సాగునీరు అందించిన సందర్బంగా రామదాసు కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు.


తోలుత గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులతో కలసి రామదాసు కండ్రిక చెరువును పరిశీలించారు. పెన్నమ్మ నీటితో నిండుకుండలా ఉన్న చెరువును చూసి ఆనందించి, ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఎన్నోఏళ్ళుగా తీరని కలగా మిగిలిపోయిన రామదాసు కండ్రిక గ్రామ రైతులకు సాగునీరు అందించడంలో విశేష కృషి చేసిన మంత్రి కాకాణి ని గ్రామ పొలిమేరలో గుర్రంబండి ఎక్కించి, సంప్రదాయ వస్త్రధారణ చేసి, అశేష జనం వెంటరాగా మేళతాళాలతో గ్రామంలోకి తోడ్కోని వెళ్లారు.


అనంతరం రైతులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి రైతులకు సాగునీరు అందించామన్నారు. భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బందులు లేకుండా రెండుకార్లు పండించే విధంగా శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాలువ నిర్మాణ సమయంలో ఎదురైన అడ్డంకులు, ఆటంకాలను అధిగమించి రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశామన్నారు. రామదాసు కండ్రిక మాజీ సర్పంచ్ షాజహాన్, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి అలుపెరుగనిపోరాటం చేశారని కొనియాడారు.


అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు,  డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయుటకు 70 కోట్ల నిధులు మంజూరు చేసామన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటికి కొరత రాకుండా ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించేందుకు 84 కోట్ల నిధులు మంజూరు చేసామన్నారు. అదేవిధంగా నాయుడుపాలెం గ్రామానికి సాగునీరు అందించేందుకు 84 లక్షల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు.


ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నందువల్లే రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాలన పట్ల 90 శాతానికి పైగా ప్రజలు సంతోషంగా ఉన్నారని, గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి లభిస్తున్న విశేష ఆదరణే ఇందుకు తార్కాణమన్నారు.


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాజునీ షాజహాన్, మాజీ సర్పంచ్ షాజహాన్, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, ఇరిగేషన్ ఇ ఇ నాగరాజు, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



Comments