తిరుపతి లో అటవీ అమరవీరుల సంస్మరణ దినం



*తిరుపతి లో అటవీ అమరవీరుల సంస్మరణ దినం


*


*ముఖ్య అతిథిగా హాజరయ్యి నివాళులు అర్పించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


*అటవీ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి భాద్యత* 


*అటవీ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


తిరుపతి, నవంబర్ 10 (ప్రజా అమరావతి): అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం, అటవీ సంరక్షణ మన ప్రతిఒక్కరి భాద్యత  అని   రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.


తిరుపతి జూ పార్క్ సమీపంలో గురువారం  ఏర్పాటు చేసిన  అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన అటవీ అమరవీరులకు పుష్ప గుచ్చాలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కొంత మంది అటవీ అధికారులకు ఆయుధాలు పంపిణీ చేసిన అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పూర్వ కాలం నుండి ఎంతో మంది అటవీ సంపద దోచుకుంటుంటే, ఆ సంపదను రక్షించే పనిలో అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని , అటవీ సిబ్బంది కష్టాల గురించి ఆలోచన చేసి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటవీ శాఖ మంత్రిగా అధికారులకు 360 కొత్త వాహనాలు అందించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎర్ర చందనం అధికంగా ఉన్న 24 డివిజన్ ల ఐఎఫ్ఎస్ అధికారులకు గన్ మ్యాన్ లను అందించామని తెలిపారు. రాష్ట్రంలో 1939 నుండి నేటి వరకు 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ లో ప్రాణాలు అర్పించండం బాధాకరమని,  అందులో నలుగురు  ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారని ప్రాణ త్యాగాలు చేసిన వారిలో అత్యధిక శాతం మన ప్రాంతం నుండే ఉన్నారని  ఎర్రచందనం ను కాపాడుకునే బాధ్యత లో వారు అసువులు బాసారని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

 

 రాష్ట్రవాసి, రాజమండ్రికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి.శ్రీనివాస్ 1991 లో కర్ణాటక లోనీ చామరాజనగర్ లో విధులు నిర్వహిస్తూ 1991 నవంబర్ 10 న  గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అసువులు బాసారని అప్పటి నుండి  ఈరోజు ను  అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా  జరుపు కుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.62 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం లో 37392 చదరపు కిలోమీర్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉందని ఇది 22.94 శాతం మాత్రమే ఉందనీ, అటవీ విస్తరణ ను మరింతగా పెంచేందుకు సిఎం శ్రీ వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి అవెన్యూ ప్లాంటేషన్ చేశామని, ఫారెస్ట్ నర్సరీ అభివృద్ధి చేయడం, అటవీ జంతువుల సంరక్షణతో పాటు, ఆదాయార్జన పై కూడా దృష్టిపెట్టి ఇప్పటికే ఎకో టూరిజం ను అందుబాటులోకి తెస్తున్నామని తద్వారా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం మాత్రమే కాకుండా అటవీ పై మరింత అవగాహన పెరిగేందుకు ఉపయోగ పడుతుందని  తద్వారా స్మగ్లింగ్ తగ్గే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎర్ర చందనం మన రాష్ట్రంలోని ఇదే ప్రాంతంలో, ఇదే శేషాచలం అడవుల్లో ఉండటం మనకు గర్వ కారణమని  గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జూ లో యనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కోసం ఒక డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటు చేశామని  రానున్న రోజుల్లో జూ పార్క్ లను అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. సమావేశ అనంతరం ప్రాంగణంలోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించారు. 


ఈ కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, పిసిసిఎఫ్  మధుసూధన్ రెడ్డి, ఎంపి  గురుమూర్తి, ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి,  అడిషనల్ పి.సి.సి.ఎఫ్ గోపీనాథ్, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వర్ నాయుడు, జూ పార్క్ క్యురేటర్ సెల్వం, తిరుపతి డి.ఎఫ్.ఓ సతీష్ రెడ్డి, చైతన్య కుమార్, ఎస్.వి.యు బయోట్రిమ్ అధికారి యశోద బాయి, నరేంద్రన్, అనురాగ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image