ఉద్యోగుల సహకారంతోనే క్షేత్రస్థాయిలో పథకాలు విజయవంతంగా అమలు

 *ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉన్నారు*                                                                                 

                 *రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*                                                                                                                                                     *ఉద్యోగుల సహకారంతోనే  క్షేత్రస్థాయిలో పథకాలు విజయవంతంగా అమలు


*                                                                                                  

         *ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి*                                                                                                                                              అమరావతి, నవంబరు  17 (ప్రజా అమరావతి): ఉద్యోగులకు సంబందించిన ఏ విషయంలోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాదు, లేదు అని ఎప్పుడూ అనరని, అవకాశం ఉన్నంత వరకూ సాద్యమైనంత మేర ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకే ఆయన ప్రాధాన్యత నిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో ప్రభుత్వ సలహాదారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి కి నూతనంగా కేటాయించిన చాంబరును ఆయన ప్రారంభించిన తదుపరి ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డితో కలసి ప్రసగించారు. ఈ సందర్బంగా మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమానికై ప్రత్యేకంగా సలహాదారుని నియమించిన దాఖలాలు లేవన్నారు. అయితే తమ ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వానికి, ఉద్యోగులకు మద్య వారధిగా ప్రత్యేకంగా ఒక సలహాదారుని నియమించడం జరిగిందన్నారు. ఈ సలహాదారుని ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సాద్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించుకునేందుకు  ప్రభుత్వం ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించిందన్నారు.  అదే విధంగా  ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వనరులు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం సాధ్యమైనంత మేర సానుకూలంగా పరిష్కరించిందన్నారు. తెలంగాణా రాష్ట్రంతో తీసిపోని విధంగా   రాష్ట్ర ఉద్యోగులకు 11 వ పి.ఆర్.సి.ని అమలు చేయడం జరిగిందన్నారు.  15 నుండి 18 శాతం వరకూ అదనంగా ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును  62 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. అదే విదంగా  ఉద్యోగుల సంక్షేమంతో పాటు సమాజంలో అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి అంశంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎటు వంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ (DBT) విధానం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్దిచేకూర్చే విధంగా  ఒక క్రమ పద్దతిలో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదన్నారు.  అయితే ఓటు కోసమే  ఈ పథకాలను అమలు చేస్తున్నారని అనుకోవడం ఒక భ్రమ అన్నారు. 

ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని నిస్సహాయులను ఉద్దరించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పధకాలు విజయవంతంలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తున్నారని కితాబిచ్చారు. ఉద్యోగులు అంతా తమ టీమ్ లో ప్రముఖ భాగస్వామ్యులే అనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  ఉంటారని, ఉద్యోగుల సమస్యలను సాద్యమైనంత మేర పరిష్కరించాలని, వారికి లబ్దిచేకూర్చాలని ముఖ్యమంత్రి అంటూ ఉంటారని  ఆయన అన్నారు. ఆర్థికేతర సమస్యలను అన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, అయితే  రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక  పరమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను సాద్యమైనంత మేర పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను ఉద్యోగులకు స్పష్టంగా వివరించడం జరుగుచున్నదన్నారు.  అంతేగాని గతంలో మాదిరిగా ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు సృష్టించి వారిని తమ ఓటు బ్యాంకులా మార్చుకునే కుతంత్రాలను తమ ప్రభుత్వం చేయడం  లేదన్నారు. సమాజంలోని నిరుపేదల అభ్యున్నతికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో నిజాయితీతో, నిబద్దతతో పారదర్శకంగా చేస్తున్న కృషికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సంపూర్ణంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 


              ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవిన్యూ శాఖ అసోషియేషన్ అద్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి తదితరులతో పాలు పలు ఉపాద్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  


 

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image