అముల్ పాల గిట్టుబాటు ధరల పెంపు..

 అముల్ పాల గిట్టుబాటు ధరల పెంపు..


* *జిల్లా కలెక్టర్   బసంత కుమార్

* *24-11-2022 నుండి అమలులోకి రానున్న కొత్త ధరలు*



పుట్టపర్తి, నవంబర్ 23 (ప్రజా అమరావతి): పాడి రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. కైరా యూనియన్ ఎపి - అముల్ డైరీ వారు.. ఈ నెల 24వ తేదీ గురువారం నుండి పాల గిట్టుబాటు ధరను పెంచడం జరిగిందని.. ఈ విషయాన్ని పాడి రైతులు, పాల ఉత్పత్తిదారులు గమనించాలని.. జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసారు.


ఈ మేరకు కైరా యూనియన్ ఎపి - అముల్ డైరీ సంస్థ  అముల్ బ్రాండ్ కింద పాలు, పాల ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు.


దీని ప్రకారం  పంపించిన వివరములు ప్రస్తుతం రూ.30.50 ధర ఉన్న ఆవుపాలు (కనిష్ట కొవ్వు శాతం 3.50 %, ఎస్.ఎన్. ఎఫ్. 8.5%) రూ.32.13 లకు పెంచడం జరిగింది. అలాగే.. రూ.42.50 ధర  ఉన్న గేదెపాలు (కనిష్ట కొవ్వు శాతం 6.0 %, ఎస్.ఎన్. ఎఫ్. 9.0%) రూ.44.97 లకు పెంచడం జరిగిందన్నారు. కాగా.. పాల ఉత్పత్తి ఖర్చు పెరగడం, నిర్వహణ భారం కావడం వంటి కారణాలతో అమూల్ పాల ధరలను పెంచడం జరిగిదన్నారు. 


అలాగే నాణ్యమైన పాల సేకరణను ప్రోత్సహిస్తూ.. కార్యకర్తలకు ఇచ్చే నిర్వహణ చార్జీలను కూడా ఒక కేజీ ఘన పదార్థాలకు గాను 20% ను పెంచిందన్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం రూ.7.9 లుగా ఉన్న నిర్వహణ చార్జీ మొత్తాన్ని రూ.9.5 లకు పెంచడమైనదన్నారు. 


అంతేకాకుండా.. పశువులు ఆరోగ్యకరంగా ఉండేందుకు, పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు.. అవసరమైన పోషక విలువలున్న పశుదాణాను పాడి రైతులకు సరఫరా చేస్తున్న కార్యకర్తలకు 50 కేజీల బస్తాకు గాను రూ.10 ల చొప్పున ప్రోత్సాహకాన్ని రాష్ట్రంలోని పాల అభివృద్ధి సంఘం ద్వారా  22-11-2022 నుండి అముల్ సంస్థ అందివ్వడం జరుగుతోందన్నారు.


కావున జిల్లాలోని పాడి రైతులు, పాల ఉత్పత్తి దారులు, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సంఘం (ఎపిడిడిసిఎఫ్) సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.



Comments