తెలుగు ఆడబిడ్డల ఆత్మస్థైర్యం పెంచాలని నాడు డ్వాక్రా సంఘాలు తెచ్చాను.


 *పత్తికొండలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో:-*

పత్తికొండ రోడ్ షోలో పోటెత్తిన ప్రజలు

కర్నూలు జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు.

అనేక సార్లు జిల్లా పర్యటనకు వచ్చినా....ఎన్నడూ చూడని స్థాయిలో జనం తరలివచ్చారు.

తెలుగు ఆడబిడ్డల ఆత్మస్థైర్యం పెంచాలని నాడు డ్వాక్రా సంఘాలు తెచ్చాను.

మొన్న వైజాగ్ వచ్చిన ప్రధాని మోదీ సైతం డ్వాక్రా సంఘాలను కొనియాడారు.

తెలుగు మహిళలంటే నా తోబుట్టువులు. ఆడపిల్లలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాను.

రాష్ట్రం విడిపోయిన సమయంలో నన్ను గెలిపిస్తే...రాత్రింబవళ్లు పనిచేశాను.

2029లో ఎపి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి అని ప్రయత్నించాను.

అయితే జగన్ కు ఇచ్చిన ఒక్కచాన్స్ తో అంతా రివర్స్ లో పోతుంది.

మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. జగన్ ఇచ్చేది గోరంత....దోచేది కొండంత

అన్ని ధరలు పెరిగాయి...ప్రజలపై పన్నులు పెరిగాయి. నెలకు ఒక్కొ కుటుంబంపై లక్షభారం మోపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి

యువతకు ఒక్క ఉద్యోగం వచ్చిందా.

టిడిపి హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

కర్నూలులో ఎయిర్ పోర్ట్ తెచ్చాను....జిల్లాలో సీడ్ పార్క్ తెచ్చాను.

అనంతపురంలో కియా మోటార్స్ సహా సీమలో అనేక పరిశ్రమలు తెచ్చాను

టిడిపి అధికారంలో ఉండి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ కూడా వచ్చేది

కడపలో స్టీల్ ప్లాంట్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా

నేను ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు.

పత్తి కొండ ఎమ్మెల్యే పేటిఎం బ్యాచ్ ను పంపింది

నేను జగన్  నాన్నను చూశా...వాళ్ల నాన్నను చూశా..దేనికీ భయపడను

టివిలో మాట్లాడే జర్నలిస్టులపైనా కేసులు పెడుతున్నాడు.

సిఐడి అంటే అక్రమ కేసులు పెట్టడానికేనా

నాడు బకాసురుడిని అంతం చేసిన భీముడిలా.....రాష్ట్రంలో భూ బకాసురులను, జగన్ రెడ్డిని కట్టడి చెయ్యాలి

పత్తి కొండ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో అన్నీ అక్రమాలే

ఇసుక దందా అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వారిపై కేసు పెట్టిస్తున్నారు. 

నేను ధర్మం కోసం పోరాడుతున్నా....ఈ చోటామోటా నాయకులకు భయపడను

నిబంధనలు పాటించని పోలీసులను జగన్ రెడ్డి కూడా కాపాడలేరు

పత్తికొండలో టమాటా రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది

నకిలీ విత్తనాలతో పత్తి రైతులు నష్టపోయారు.

జగన్ ఒక్క రైతును పరామర్శించాడా....ఒక్క పొలానికి వచ్చాడా

రాష్ట్రంలో మద్యం కంపెనీలు అన్నీ జగన్ వే....

జగన్ రాజకీయ వ్యాపారస్తుడు

వైసిపి ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు అన్నీ నిలిపివేశారు

సిఎం జగన్ కు రంగుల పిచ్చి. టిడిపి హాయంలో కట్టిన భవనాలకు రంగులు వేసుకుంటాడు

రంజాన్ తోఫాకు డబ్బులు లేవు కానీ.....రంగులకు డబ్బులు ఉంటాయి

బిసిలకు పథకాలు లేవు...కానీ సాక్షికి మాత్రం కోట్ల ప్రకటనలు 

సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో పదవులు

సాక్షి గుమస్తా ఇప్పుడు రాష్ట్రంలో సకల శాఖా మంత్రి

రాష్ట్రంలో మెడపై కత్తి పెట్టి ఆస్తులు ఖాజేస్తున్నారు వైసిపి నేతలు

ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా

పత్తి కొండకు వస్తుంటే రోడ్డు చేశాను...దారుణంగా ఉంది

పత్తి కొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా

కర్నూల్ లో మేము కట్టిన ఎయిర్ పోర్ట్ లో జగన్ దిగాడు....మనం తెచ్చిన సోలార్ ప్లాంట్ తాను ప్రారంభించాడు

కర్నూలుకు హైకోర్టు వస్తే నేను అడ్డుపడుతున్నా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు

ప్రతిపక్షాలపై దాడులు చేయించి డిజిపి సమర్థించుకుంటున్నారు

అలా సమర్థించిన నాటి డిజిపి సవాంగ్ అన్న ఇప్పుడు ఏమయ్యాడు

నందిగామ వెళితే రాళ్లు వేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు

పూలల్లో రాళ్లు వచ్చాయని నందిగామ ఘటనపై పోలీసులు చెప్పారు. అంటే రేపు పూలల్లో బాంబులు వస్తాయా

నాకు నా ప్రాణం ముఖ్యం కాదు...రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం

పవన్ కళ్యాన్ మీటింగ్ కు భూములు ఇస్తే గుంటూరు జిల్లాలో గ్రామస్థులను వేధించారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూలగొట్టారు.

పవన్ విశాఖ వస్తే అక్కడా ఇబ్బంది పెట్టారు

నేను అనుకుంటే జగన్ నాడు తిరిగేవాడా

రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నేనే స్పందిస్తా

ప్రజా స్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నేతగా నా బాధ్యత

ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిని కంట్రోల్ చెయ్యాల్సి ఉంది

బాబాయ్ ను చంపి నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశాడు

తండ్రి హత్యపై వివేకా కూతురు సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడుతుంది

టిడిపి ఎన్నికలకు సిద్దంగా లేదు అని సిఎం అనుకుంటున్నాడు

5 వేలు 10 వేలు ఇచ్చి గెలుద్దాం అని జగన్ అనుకుంటున్నాడు

డబ్బులకు మన జీవితాలు తాకట్టు పెట్టుకుంటామా

స్థానికంగా పంటల భీమా చెల్లింపులు చెయ్యలేదు

ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి, టమాటా పంటల రైతులను ఆదుకోవాలి

నకిలీ విత్తనాల కారణంగా పత్తి దెబ్బతిన్నది. దీనికి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి

రైతులకు డ్రిప్ సబ్సిడీలు కొనసాగించాలి

నంద్యాలలో అబ్బుల్ సలాం కుటుంబాన్ని ఎలా వేధించి చంపారో అంతా చూశాం

మైనారిటీలకు ఇచ్చే అన్ని పథకాలు రద్దు చేశారు

మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది టిడిపి. వక్ఫ్ బోర్డు అస్తులు కాపాడింది కూడా టిడిపినే

అసెంబ్లీ పరిణామాలు చూసి మళ్లీ అసెంబ్లీ కా రాను అని ప్రకటించాను

మళ్లీ గౌరవ సభలోనే  నేను అడుగు పెడతాను అని చెప్పాను

ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నా...రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తా.

Comments