నందిగామలో చంద్రబాబు రోడ్ షోకు అనూహ్య స్పందన

 - నందిగామలో చంద్రబాబు రోడ్ షోకు అనూహ్య స్పందన


- చంద్రబాబు లక్ష్యంగానే రోడ్ షోపై  రాయి విసిరారు

- భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

- టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ డిమాండ్ 



విజయవాడ, నవంబర్ 4 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చిందని టిడిపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ చెప్పారు. చంద్రబాబుతో పాటు టిడిపి ముఖ్య నేతలతో కలిసి రోడ్ షోలో శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఈ రోడ్ షోకు వచ్చిన ఆదరణను చూస్తే వచ్చే ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని అర్థమైనట్టు చెప్పారు. అందువల్లే రోడ్ షోపై అగంతకుడు రాయి విసిరాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని రాయి విసరడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అగంతకుడు విసిరిన రాయి తగిలి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు చెప్పారు. వైసిపి దొంగల్లారా ఖబడ్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని అన్నారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై కూడా చంద్రబాబు మండిపడ్డారని అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం మానుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్ షోలపై అగంతకులు దాడులు చేసే పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపైనే ఉందని శిష్ట్లా లోహిత్ గుర్తు చేశారు.

Comments