*పొట్టి శ్రీరాములు త్యాగం మహోన్నతం*
పార్వతీపురం/సాలూరు, నవంబరు 1 (ప్రజా అమరావతి)
: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మహోన్నతమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళ వారం సాలూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆంధ్రులు దీర్ఘకాలంగా కలలు కన్నారని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంతోపాటు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారరంభం అయిందని, 1912లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహా సభలలో పూర్తి స్థాయిలో అంకురార్పణ జరిగిందని చెప్పారు. రాష్ట్ర సాధనలో అనేక మంది మహామహులు పోరాటం చేసారని, చివరగా పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు కఠిన నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేశారని ఆయన చెప్పారు. అమరజీవి ప్రాణ త్యాగంతో చివరగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర సాధనతో దక్కిన ప్రయోజనాలు బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment