రగులుతున్న ఇప్పటం ఇళ్ల కూల్చివేతల వివాదం..
మంగళగిరి (ప్రజా అమరావతి);
ఆర్టీసీ బస్సు సర్వీస్ లేని ఇప్పటం గ్రామంలో రోడ్డ విస్తీరణ పేరుతో ఆరాచకంపై వేడేక్కిన రాజకీయం.
ఇప్పటం గ్రామ అభివృద్దికి 50 లక్షల విరాళం వినియోగిస్తాం.
మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు.
మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం.
గ్రామ కమిటీ ద్వార జరిగే అభివృద్ది పనికి పవన్ కళ్యాణ్ శంకుస్దాపన చేస్తారు.
కక్షపూరితంగా ఇళ్ల కూల్చి, వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుంది.
గ్రామాన్ని వల్ల కాడు లా మార్చారని ఆరోపణ.
ఎమ్మెల్యే ఆర్కే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
గ్రామ అభివద్ది అంటే వైఎస్సార్ బోమ్మ ఉంచి గాందీ బోమ్మ తొలగించటమా?
ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడతామంటే చూస్తు ఊరుకునేది లేదు.
విలేకరుల సమావేశంలో ఇప్పటం గ్రామస్తులు, కాపు సంఘ, జనసేన నాయకులు
జనసేన ఆవిర్బావ సభ మార్చి 14వ తేదీన ఇప్పటం గ్రామంలో జరుగగా పవన్ కళ్యాణ్ సభకు భూములు ఇచ్చామని, మార్చి 14వ తేదీనే నోటీసులు
గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందచేత.
60 అడుగులకు ఒప్పుకుని సరే అని ఇప్పుడు అన్యాయం గా మా ఇళ్లను కూల్చేశారు
తాడేపల్లి మండల, ఎంపిటిఎంసి, గ్రామ మాస్టర్ ప్లాన్ లో 60 అడుగల రోడ్డుగా ఉండగా,
120 అడుగుల రోడ్డు చేయాలని కక్షపూరితంగా ఇళ్లు కూల్చివేశారు.
పవన్ కళ్యాణ్ ప్లెక్సీలు చించి, పేడ కొట్టి మనోభావాలు దెబ్బతీనే విధంగా వ్యవహరించారు.
ఒక్క సామాజిక వర్గాన్ని వేధిస్తున్న వైకాపా నాయకులకు రాబోయే ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారు.
addComments
Post a Comment