కళాకారుల కుటుంబాలు విద్యావంతులు కావాలన్నదే జగనన్న ఆశయం: డిప్యూటీ సీఎం

 


కళాకారుల కుటుంబాలు విద్యావంతులు కావాలన్నదే జగనన్న ఆశయం: డిప్యూటీ సీఎం



మన సంస్కృతి సాంప్రదాయ కళలు భావితరాలకు అందించాలి: మంత్రి ఆర్కే రోజా


మన వారసత్వ సంపద కళలకు మళ్లీ పునరుజ్జీవనం: ఎమ్మెల్యే భూమన


తిరుపతిలో ఘనంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు


తిరుపతి ,నవంబర్ 19 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ అంబేద్కర్ ఆశయం చదివే సంపద అన్నారని ఆ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారని డిప్యూటీ సీఎం జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి అన్నారు. 


మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ  కళ లను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఒక కళాకారునిగా కళాకారులకు అండగా ఉంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖా *మంత్రి శ్రీమతి ఆర్ కే రోజా అన్నారు.


శనివారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు  నేటి నుంచి మూడు రోజులు (19,20,21) వివిధ కళారూపాలకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఆర్కే రోజా, ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం, అతిథులుగా తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి, శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, సంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉషా, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ , డైరెక్టర్ మల్లికార్జున్ రావు , సినీ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి జ్యోతిని వెలిగించి , నటరాజ విగ్రహానికి పూలమాలలు సమర్పించి , ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.


డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని తెలుగు పదానికి స్వస్తి పలకలేదని, విద్యను ఒక సంపదగా భావించి పేదలకు ఇంగ్లీష్ బోధన అవసరమని గుర్తించి విద్యకు పెద్దపీట వేస్తున్నారని నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి , అమ్మఒడితో పిల్లలు బడి మానేయకుండా చూస్తున్నారని అన్నారు. ఇక్కడ హాజరైన కళాకారులు తప్పనిసరిగా ఉన్నత చదువులు చదవాలని అప్పుడే జగనన్న ఆశయం నెరవేరుతుందని అన్నారు.  జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ఈ స్వర్ణోత్సవ సంబరాలకు శ్రీకారం చుట్టడం మంత్రి రోజాను అభినందిస్తున్నానని అన్నారు.


మంత్రి రోజా మాట్లాడుతూ తిరుపతిలో పుట్టిన నేను కళా రంగంలో రాణించడం వల్లే నేడు గుర్తింపు వచ్చి రాజకీయాల్లో రాణించి నేడు మంత్రిగా కళా రంగానికి సేవ చేసే భాగ్యం లభించిందని అన్నారు. జగనన్న పుట్టినరోజును పురస్కరించుకొని మొదటగా వెంకన్న పాదాల చెంత ఈ గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నామని అన్నారు. రాయలసీమ ముద్దుబిడ్డ , సంక్షేమ సామ్రాట్ అయిన జగనన్న కళాకారులకు అండగా నిలుస్తూ కళాకారుల పింఛను, అమ్మ ఒడి ,ఆసరా, చేయూత వంటి పథకాలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న పుట్టినరోజు కళాకారులు ఆయనకి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. నేటి నుండి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లా ల కళాకారులకు, ఈనెల 24 ,25 ,26 గుంటూరు, 29 ,30 డిసెంబర్ 1న రాజమండ్రి, 7, 8, 9న విశాఖపట్నం లలో జోనల్ పోటీలు, ఫైనల్ గా 19 ,20 విజయవాడలో నిర్వహిస్తున్నామని అన్నారు. పండుగ వస్తే జరుపుకునే కళలను నేడు వేదికపై ఒకే చోట చూడడం పండుగలా తలపిస్తున్నదని అన్నారు


తిరుపతి ఎంపీ మాట్లాడుతూ ప్రాచీన కళాకారులను ప్రోత్సహించే రీతిగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. 


నగర పాలక మేయర్ మాట్లాడుతూ గొప్ప కార్యక్రమం తిరుపతి నగరం నుండి ప్రారంభించడం సంతోషమని అన్నారు. రాయలసీమ జిల్లాల నుండి వచ్చిన కళాకారులకు శుభాభినందనలుని తెలిపారు.




తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ వారసత్వ సంపద కలలను కాపాడాలని ఉద్దేశంతో కళాకారునిగా మంత్రి రోజా నేడు ఆంధ్రప్రదేశ్లో కళలకు పునరుజీవనం కల్పిస్తున్నారని ఇది ఒక భగీరథ ప్రయత్నమని అన్నారు. మన సాంస్కృతిని ప్రచారం కల్పించే దిశగా కళల నన్నిటిని ఒకే వేదికపై తీసుకురావడం అభినందనీయమని అన్నారు.




సాంస్కృతిక శాఖ చైర్మన్ మాట్లాడుతూ కళలను మరిచిపోతున్న సమయంలో  వారసత్వంగా కొనసాగించాలని మంత్రి ఆలోచన గొప్పదని , కళా రంగానికి ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు.


సంగీత నాట్య జానపద కళల పోటీల న్యాయ నిర్ణేతలుగా అనిత కృష్ణ , ఉషారాణి , ఉమామధుబాల, రవి శంకర్ రెడ్డి కొండా రవి, శరత్ చంద్ర లు పోటీల అనంతరం విజేతలను నిర్ణయించనున్నారు.


ఈ కార్యక్రమ నిర్వహణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి సీఈవో మల్లికార్జున రావు, విజయవాడ నాట్య కళాశాల ప్రిన్సిపల్ ముని కుమార్ వారి సిబ్బంది నిర్వహిస్తున్నారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి ,సెట్విన్ సీఈవో మురళి కష్ణ , స్థానిక కళాకారులు రాయలసీమ జిల్లాల నుండి పోటీలలో పాల్గొనడానికి వచ్చిన కళాబృందాలు ఉన్నారు.


సమావేశ అనంతరం 3 రోజులపాటు జరపనున్న పోటీ లు


మహతి ఆడిటోరియంలోపల

కూచిపూడి భరతనాట్యం ఆంధ్ర నాట్యం పోటీలు


మహతి ఆడిటోరియం (యోగ సెంటర్ మినీ మహతి) లో

సంగీత పోటల పోటీలు 


మహతి ఆడిటోరియం వెలుపల స్టేజిపై జానపద నృత్యాలు కోలాటాలపై పోటీలు 


ప్రారంభమయ్యాయి.




Comments