మాతృ మరణాల పట్ల పక్కా విశ్లేషణ జరగాలి



*మాతృ మరణాల పట్ల పక్కా విశ్లేషణ జరగాలి


*


*మాతృ మరణాలు సంభవించరాదు


*నెగిటివ్ రక్త గ్రూప్ దాతలు ముందుకు రావాలి.


*జిల్లా ఆసుపత్రిలో దాతలు నమోదుకు కేంద్రం


*హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిల చికిత్స వద్దు 


పార్వతీపురం, నవంబరు 11 (ప్రజా అమరావతి): మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరుగుటకు సౌకర్యాల లోపమా, వైద్య సేవలలో లోపమా, సామాజిక పరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉప కమిటీ పక్కాగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మృతి చెందితే అందుకుగల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు అందుబాటు, క్లినికల్ సౌకర్యాల లభ్యత, సామాజిక విధానంలో జరిగిన తప్పులు విశ్లేషించాలని ఆయన సూచించారు. హై రిస్క్ కేసులకు స్థానిక ఆర్.ఎం.పి వైద్యులు చికిత్స అందించడం పట్ల తీవ్రంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో గర్భిణీల ఆరోగ్య పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి మరణాలు సంభవిస్తున్నట్లు ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తలు వివరించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ప్రసవాలకు వచ్చే వారి రక్తపు గ్రూప్ ముందుగా పి.హెచ్.సి స్థాయిలో  గుర్తించి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి తెలియజేయాలని ఆయన అన్నారు. అవసరం మేరకు రక్తపు యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ చికిత్స అందించిన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అటువంటి కుటుంబ సభ్యులను రక్త దానానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు. 


*రక్త దానానికి ముందుకు రావాలి* : 


ప్రసవ సమయంలో అవసరమగు రక్తపు యూనిట్లు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, అందుబాటులో ఉండక పోవడంపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందిస్తూ యువత రక్త దానానికి ముందుకు రావాలని కోరారు. రక్త దానం ప్రాణ దానమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. రక్త దాతలు నిజమైన హీరోలు అని అన్నారు. రక్త దాతలు తమ పేర్లను జిల్లా ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఇందుకు ప్రత్యేక కౌంటర్ ను శని వారం ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రత్యేక కౌంటర్ వద్ద పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి సహకరించాలని, ప్రాణాలు కాపాడాలని కోరారు.  


*క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి* 


పి.హెచ్.సి వైద్యులు, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది గ్రామాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు చికిత్స చేయరాదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి చికిత్స అందించేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రసవ సమయంలో ఉన్న గర్భిణీల ఆరోగ్యం పట్ల అత్యంత జాగరూకత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాలతో చెలగాటం వద్దని ఆయన సూచించారు. 


*ప్రాంతాలను గుర్తించండి - అవగాహన కల్పించండి* 


మూడు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గ్రామంలో 30 సంవత్సరాల వయస్సులో 8వ కాన్పులో మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ ఇటువంటి అభ్యర్థులను మండలాల వారీగా గుర్తించాలని సూచించారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, దానిని నివారించాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి, కుటుంబ నియంత్రణ చికిత్సలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. 


జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ జిల్లాలో 11 మాతృ మరణాలు సంభవించాయని తెలిపారు. 


ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, వైద్య శాఖ అధికారులు ధవళ భాస్కరరావు, అనిల్, టి. జగన్మోహన రావు, సి.హెచ్.విజయ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image