కె.ఎల్.యూనివర్సిటీలో ఓటు నమోదు అవగాహనా సదస్సు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);



కె.ఎల్.యూనివర్సిటీలో ఓటు నమోదు అవగాహనా సదస్సు.



ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకోవాలని తాడేపల్లి మండల తహసిల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి అన్నారు ఈరోజు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వం నిర్దేశించిన స్వీప్ సదస్సును నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత  ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత ఓటు కీలకపాత్ర పోషిస్తుందన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సదస్సుకు గౌరవ అతిథిగా మంగళగిరి తహసీల్దార్ జి.వి.రంప్రసాద్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ జిపి వర్మ, ప్రో.వైస్ చాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకటరామ్,డీన్. సలహాదారు హబీబుల్లాఖాన్, అసోసియేట్ డీన్  రుత్ రమ్యా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో 

కె.ఎల్. విశ్వవిద్యాలయంలో ఆయా విభాగాల్లో  విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments