రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పి.విజయబాబు

 రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పి.విజయబాబు


తెలుగువారు ఉభయ భాషా ప్రవీణులుగా అభివృద్ధి చెందేలా కృషి

తెలుగు అకాడమీ,ప్రెస్ అకాడమీల తోడ్పాటుతో తెలుగుభాష అభివృద్ధికి కృషి

పాలనా భాషగా తెలుగు అన్నివిభాగాల్లో సక్రమంగా అమలయ్యేలా కృషి 

ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్సు సహాయంతో తెలుగు భాష అభివృద్ధికి ప్రయత్నం చేస్తా

న్యాయ స్థానాల్లో సహితం తెలుగులో వాదనలు జరగాల్సిన అవసరం ఉంది

తెలుగు భాషకు కొత్త రూపును తీసుకువచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తాను

అమరావతి,3 నవంబరు (ప్రజా అమరావతి):పాలనా భాషగా తెలుగును అన్ని శాఖల్లోను పూర్తిగా అమలు చేసే విధంగా తనవంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయ బాబు స్పష్టం చేశారు.గురువారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాషా సంఘం అధ్యక్షులుగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.ముందుగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పి.విజయబాబుచే భాషా సంఘం అధ్యక్షనిగా ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగు వారందరూ తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో కూడా ఉభయ భాషా ప్రవీణులుగా అభివృద్ధి చెందేలా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.తెలుగు అకాడమీ,ప్రెస్ అకాడమీల సహకారంతో రానున్నరోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేయనున్నట్టు చెప్పారు.తనను రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు విజయబాబు తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సహకారంతో తెలుగు భాషను మరింత సులభతరం చేసి విస్తృత పర్చేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తానని రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు స్పష్టం చేశారు.ఇందుకు గాను త్వరలో రాష్ట్ర ఐటి శాఖ అధికారులతో సమావేశం కానున్నట్టు వి.జయబాబు తెలిపారు.తెలుగు భాషను సులభంగా ప్రతి ఒక్కరూ నేర్చుకునే రీతిలో తగిన చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు.ప్రవాసాంధ్రుల పిల్లలు సహితం తెలుగును సక్రమంగా నేర్చుకునే విధంగా తగిన చర్యలు తీసుకోనున్నటు పేర్కొన్నారు. సమాజంలో తెలుగు భాషపై అభిమానం ఉన్నప్రతి ఒక్కరి సహకారం తీసుకుని రానున్న రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి వికాసానికి అన్నివిధాలా ప్రయత్నం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.ప్రపంచీకరణ నేపధ్యంలో అన్ని చోట్ల రాణించాలంటే మాతృ భాషతోపాటు ఆంగ్లభాష తప్పనిసరని అందుకే రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుండే ఆంగ్ల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని విజయబాబు గుర్తు చేశారు.తాను సమాచార హక్కు చట్టం కమీషనర్ గా ఉండగా దేశంలోనే అత్యధిక కేసులు పరిష్కరించిన కమీషనర్లలో రెండవ వానిగా నిలిచినట్టు తెలుగు భాషా సంఘం అధ్యక్షులు విజయ బాబు ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు ఎన్.లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సరైన వ్యక్తికి సరైన పదవి అన్నరీతిలో ముఖ్యమంత్రి వర్యులు విజయబాబుకు తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు భాషపై అభిమానం ఉన్నందునే పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినప్పటికీ 1వ తరగతి నుండి తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలని ఆదేశించారని చెప్పారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషా సంఘం ఏర్పాటుతో మాతృ భాషా వికాసానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి భాషా సంఘం అధ్యక్షులవారి నేతృత్వంలో మరింత కృషి జరగనుందని పేర్కొన్నారు.

తొలుత ఈకార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జున  స్వాగతం పలుకగా కార్యక్రమంలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర నవరత్నాలు అమలు కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు ఎ.నారాయణమూర్తి,సమాచార హక్కు చట్టం కమీషనర్లు బివి.రమణ కుమార్,ఐలాపురం రాజా,ఆర్టీఐ కార్యదర్శి సాంబశివరావు,ఎంఎల్సి అప్పిరెడ్డి,ఆర్టీఐ తొలి మరియు విశ్రాంత కమీషనర్ అంబటి సుబ్బారావు తోపాటు పలువురు రచయితలు,న్యాయవాదులు,తెలుగు భాషాభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

    

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image