రైతులకు ఆదాయం పెంచేవిధంగా జీఏపీ సర్టిఫికేషన్


విజయవాడ (ప్రజా అమరావతి)


రైతులకు ఆదాయం పెంచేవిధంగా జీఏపీ సర్టిఫికేషన్


ఆర్బీకేల ద్వారా రైతుల గడపవద్దనే అన్ని సేవలు

‘పొలంబడి’ కార్యక్రమాల ద్వారా రైతులకు మరింత ఆదాయం.. తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. 

రాష్ట్రంలో త్వరలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయం  ఏర్పాటు

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి..

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అనేక రైతు పథకాలను అమలుచేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలను కేంద్రబిందువుగా ప్రతి గ్రామంలో నెలకొల్పి గడపవద్దనే విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్ని సేవలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) & ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (ఎపెడా) ఆధ్వర్యంలో విజయవాడలో మురళీ ఫార్చూన్ హోటల్ లో గురువారం నిర్వహించిన జోనల్  స్థాయి (తూర్పుగోదావరి, కాకినాడ, డా. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల జిల్లాల) వర్క్ షాపులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇచ్చే పంటలు పండించేలా పొలంబడి కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పుడు FAO సహకారంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (GAP) పై అవగాహన కల్పించి తగు ద్రువీకరణ ఇవ్వడం ద్వారా వారి పంటలను ఎగుమతి చేసే స్థాయికి రైతును తీసుకేళ్ళలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యేశమని ఆమె తెలిపారు. రైతుల పండించే పంటలకు మంచి ధర కావాలంటే మంచి పద్దతిలో పండించారని సర్టిఫికేషన్ చాలా కీలకమన్నారు. సర్టిఫికేషన్ ఉంటే ప్రపంచ మార్కెట్ లో సైతం ఎక్కువ ధర లభిస్తోందని వివరించారు. ప్రైవేట్ ఏజెన్సీలతో రైతులకు సర్టిఫికేషన్ చేయిస్తే ఖర్చు ఎక్కువతుందని, ఆ ఖర్చు రైతులకు భారంకాకూడదనే సదుద్దేశ్యంతో అతి తక్కువ ఖర్చుతో ఏపీ సీడ్స్ సంస్థను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రణాళికలన్నీ సిద్ధం చేశామని ఆమె తెలిపారు. రాష్టంలోని 26 జిల్లాలలో ఎంపిక చేసిన క్లస్టర్ల ద్వారా  జీఏపీ శిక్షణా కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే మనం  చాల వరకు మంచి వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నామని వీటిని మరింత మెరుగు పరచుకోవడమే ఈ కార్యక్రమం ఉద్యేశమని చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది రైతులు కలిసి ఒక గ్రూపుగా రైతు ఉత్పాదక సంఘాలుగా (FPO) ఏర్పడాలని సూచించారు. అప్పుడు వ్యాపారులే రైతు సంఘాల వద్దకు వచ్చి పంట ఉత్పత్తులను రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వారికి టెక్నికల్ నాలెడ్జ్ అందించే ఉద్ధ్యేశ్యంతో యూనివర్సిటీలతో మాట్లాడి శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల వరకూ తీసుకొచ్చేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్నిసేవలు రైతు గడపవద్దనే అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించి ఈ ప్రభుత్వం సేవలందిస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నిర్వహించే ‘డా. వైఎస్సార్ పొలంబడి’. ‘డా. వైఎస్సార్ తోటబడి’ కార్యక్రమాల్లో దాదాపు 11 లక్షల మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడి 10 నుండి 22 శాతం తగ్గిందని, దిగుబడి 6 నుండి 24 శాతం పెరిగిందని ఆమె తెలిపారు.  

గత మూడేళ్ళుగా రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల నుంచి అరటి గల్ఫ్, ఆసియా దేశాలకు  ఎగుమతి అవుతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చొరవ వలనే జరిగిందని చెప్పారు. ఇప్పుడు మనం దేశంలోనే అరటి ఎగుమతులలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచామన్నారు. అలాగే మన రైతుల పంటలు కూడా ఆసియా దేశాలతో పాటు యూరప్ దేశాలకు కూడా ఎగుమతి కావాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవతో APEDA ప్రాంతీయ కార్యాలయం త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతుందని పూనం మాలకొండయ్య తెలిపారు.

ఏపీ సీడ్స్ ఎండీ జి. శేఖర్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భారతదేశ ధాన్య భాండాగారమని, రాష్ట్రంలో ప్రతి జిల్లాకి వైవిధ్యత ఉందని తెలిపారు. ఏపీ రైతులు పొలంబడి వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదన్నారు. రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశ్యంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మంచి పద్దతులతో పండించిన పంటలకు మార్కెటింగ్ లో చాలా ప్రాధాన్యత ఉంటుందని శేఖర్ బాబు తెలిపారు. 

GAP  సర్టిఫికెట్ పొందేందుకు పాటించాల్సిన పద్ధతులు, ప్రమాణాలతో పాటు సర్టిఫికేషన్ పొందిన ఉత్పత్తులను ఏ విధంగా ఎగుమతి చేయాలనే అంశాలపై ఇండిగ్యాప్ (IndGAP) సర్టిఫికేషన్ కమిటీ చైర్ పర్సన్ శ్రీహరి కొటెల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఏపీ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని శ్రీహరి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు ఎంపిక చేసిన రైతులకు విజయవాడలో గురువారం జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా డిసెంబర్ 2న, డిసెంబర్ 9న, డిసెంబర్ 16న జోనల్  స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ త్రివిక్రమ్ రెడ్డి, ఆర్బీకేల సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి. శ్రీధర్, పొలంబడి డీడీఏ యాన్.సి.యెచ్ బాలు నాయక్, ఎపెడా రీజనల్ హెడ్ యు.ధర్మారావు, పోలయ్య జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, రైతులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు. 

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image